Add Zee Business As A Preferred Source
App

Mohan Babu Vs Chiranjeevi: ఆ విధంగా చిరంజీవిపై పై చేయి సాధించిన మోహన్ బాబు.. అసలు కథ ఇదే..

Written ByTA Kiran Kumar
Published: Jun 18, 2025, 02:10 PM IST|Updated: Jun 18, 2025, 02:10 PM IST

Mohan Babu Vs Chiranjeevi: తెలుగు సినీ ఇండస్ట్రీలో చిరంజీవి, మోహన్ బాబు మధ్య కొన్ని రకాల విభేదాలున్నాయి. అంతేకాదు వీళ్లిద్దరు టామ్ అండ్ జెర్రీలా పోట్లాడుకున్న సందర్బాలున్నాయి. కానీ ఓ విషయంలో చిరంజీవిపై మోహన్ బాబు పై చేయి సాధించారు. ఆ విషయానికొస్తే.. 

Mohan Babu Vs Chiranjeevi1/6

మోహన్ బాబు వర్సెస్ చిరంజీవి

Mohan Babu Vs Chiranjeevi: తెలుగు సినీ ఇండస్ట్రీలో చిరంజీవికి మోహన్ బాబుకు ప్రత్యేక స్థానం ఉంది. అంతేకాదు వీళ్లిద్దరు పలు చిత్రాల్లో కలిసి నటించారు. అందులో కొన్ని చిత్రాల్లో ఇద్దరు హీరోలుగా నటిస్తే.. మరొకొన్ని చిత్రాల్లో చిరు హీరో అయితే మోహన్ బాబు విలన్ గా యాక్ట్ చేసారు. అయితే ఓ సందర్భంలో మోహన్ బాబు తన సినిమాతో చిరంజీవిని డామినేట్ చేశారు. 

Pedarayadu 2/6

పెదరాయడు

అవును 30 యేళ్ల క్రితం మోహన్ బాబు హీరోగా రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘పెదరాయుడు’. ఈ సినిమాలో రజినీకాంత్ కీలక పాత్రలో నటించారు. ఈ సినిమా 30 ఇయర్స్ బ్యాక్ 15 జూన్ 1995లో విడుదలై సంచలన విజయం సాధించింది. 

Bigg Boss 3/6

బిగ్ బాస్

ఇక అదే రోజు మెగాస్టార్ చిరంజీవి హీరోగా విజయ బాపినీడు దర్శకత్వంలో తెరకెక్కిన ‘బిగ్ బాస్’ సినిమా విడుదలైంది. ఈ సినిమా చిరంజీవి కెరీర్ లో ఈ సినిమా బిగ్గెస్ట్ ఫ్లాప్ గా నిలిచింది. ఈ సినిమాలో చిరంజీవి సరసన రోజా నటించింది. చిరు, విజయబాపినీడు కాంబోలో వచ్చిన చివరి చిత్రం ఇదే కావడం గమనార్హం. 

Mohan Babu Pedarayudu 4/6

మోహన్ బాబు పెదరాయుడు

అప్పట్లో మోహన్ బాబు పెదరాయుడు సినిమా హైదరాబాద్ శాంతి థియేటర్ లో 250 రోజులుగా పైగా నడిచి సంచలనం సృష్టించింది. అంతేకాదు దాదాపు 200 రోజుల వరకు ఈ సినిమా అన్ని షోస్ హౌస్ ఫుల్ తో రన్ అయింది. అప్పట్లో ఈ సినిమా ముహూర్తపు సన్నివేశానికి ఎన్టీఆర్ క్లాప్ కొట్టారు. 

Rajinikanth as Paparaydu 5/6

పాపారాయుడు గా రజినీకాంత్

మోహన్ బాబు.. పెదరాయుడులో రజినీకాంత్ పాపారాయుడు పాత్ర ఈ సినిమా సక్సెస్ లో కీ రోల్ పోషించింది. ఈ సినిమా తమిళంలో హిట్టైన ‘నాట్టామై’ సినిమాకు రీమేక్. ఈ సినిమా చేయయని రజినీకాంత్ సలహా ఇవ్వడమే కాదు.. తమిళంలో విజయ్ కుమార్ పోషించిన క్యారెక్టర్ ను తెలుగులో పాపారాయుడుగా పోషించి భేష్ అనిపించారు.రజినీ పాత్రకు సాయికుమార్ డబ్బింగ్ పెద్ద ఎస్సెట్ గా నిలిచింది.  

Pedarayudu Vs Bigg Boss 6/6

పెదరాయుడు వర్సెస్ బిగ్ బాస్

పెదరాయుడు చిత్రంలో మోహన్ బాబు నటన చూసాకా.. ఆ పాత్రలో ఆయన్ని తప్పించి మరొకరిని ఊహించు కోవడం కష్టమే. అంతలా ఆ పాత్రలో లీనమై నటించాడు. ఈ సినిమాలో మోహన్ బాబు ద్విపాత్రాభినయం చేసారు. ఆయన సరసన భానుప్రియ, సౌందర్య నటించారు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర తెలుగులో అప్పటి వరకు ఉన్న అన్ని రికార్డులను తిరగరాసి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. మొత్తంగా ఒకేరోజు విడుదలైన చిరంజీవి బిగ్ బాస్ బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్ గా నిలిస్తే.. మోహన్ బాబు పెదరాయుడు మాత్రం ఇండస్ట్రీ రికార్డులను తిరగరాయడం విశేషం.