Monday Bank Holiday: బ్యాంకు పని ఉన్న వాళ్ళు ఈరోజే పూర్తి చేసుకోండి. ఎందుకంటే సోమవారం బ్యాంకులు బంద్ ఉంటాయి. కొన్ని ప్రాంతాల్లో వరుసగా మూడు రోజులు బ్యాంకులకు సెలవులు ఉన్నాయి. శని, ఆది, సోమ మూడు రోజులపాటు బ్యాంకులు బంద్ ఉంటాయి. అయితే సోమవారం బ్యాంకులో ఎందుకు బంద్ ఉంటాయో తెలుసుకుందాం..
జూన్ నెలలో బ్యాంకులు 12 రోజులు బంద్ ఉంటాయి. ఇవి స్థానికత సెలవులతో పాటు మరిన్ని ప్రత్యేక పండుగలు, రెండో, నాలుగో శనివారంతోపాటు ప్రతి ఆదివారాలు బ్యాంకులకు సెలవులు ఉంటాయి. అయితే సోమవారం మే 26వ తేదీ కూడా బ్యాంకులు బంద్ ఉన్నాయి.
కొన్ని ప్రాంతాల్లో వరుసగా శని, ఆది, సోమ మూడు రోజులపాటు బ్యాంకులు బంద్ ఉన్నాయి. మీకు ఏమైనా బ్యాంకు పనులు ఉంటే ముందుగానే ఈరోజే పనులు పూర్తి చేసుకోండి . లేకపోతే ఇబ్బందులు పడాల్సి వస్తుంది. వరుసగా మే 24, 25, 26 తేదీల్లో కొన్ని ప్రాంతాల్లో బ్యాంకులు బంద్ ఉన్నాయి.
అయితే సోమవారం మే 26వ తేదీ త్రిపుర లోని బ్యాంకులకు సెలవులు ఉంటాయి. ఆరోజు కాశీ నజురుల్ ఇస్లాం జయంతి సందర్భంగా ప్రభుత్వ సెలవు దినం. ఈ నేపథ్యంలో ఈరోజు బ్యాంకులు ఆ ప్రాంతంలో బంద్ ఉంటాయి.
ఇక జూన్ నెల ప్రారంభానికి ముందే కొన్ని ప్రాంతాల్లో వరుసగా మూడు రోజులు బ్యాంకులకు సెలవులు ఉన్నాయి . ఇది స్థానికత ఆధారంగా జరుగుతుంది. లేకపోతే ఆర్‌బీఐ గైడ్ లైన్స్ ప్రకారం బ్యాంకులకు సెలవులు ఉంటాయి.
అయితే మే 29వ తేదీ కూడా మహారాణా ప్రతాప్ జయంతి సందర్భంగా హిమాచల్ ప్రదేశ్ లోని బ్యాంకులు బంద్ ఉంటాయి. మే 30 శుక్రవారం శ్రీ గురు అర్జున్ దేవ్ దినోత్సవం పంజాబ్‌లో అన్ని బ్యాంకులు బంద్.