Snakes in Monsoon: వర్షాకాలంలో పాముల టెన్షన్.. కాటు వేస్తే ఏంచేయాలి..?.. ఎలాంటి తప్పులు చేయోద్దు.. ఈ విషయాలు మీ కోసం...!

Snakes in monsoon:  వానాకాలంలో పాముల బెడద ఎక్కువగా ఉంటుంది. ఈ క్రమంలో చాలా మంది ఈ సీజన్ లోనే ఎక్కువగా పాము కాటుకు గురౌతుంటారు. కొన్ని జాగ్రత్తలు పాటిస్తే పాముల కాటుల నుంచి బైటపడొచ్చని నిపుణులు చెబుతున్నారు.

1 /5

ముఖ్యంగా పాములు గుబురుగా ఉండే చెట్లు, పేరుకుపోయిన చెత్త మొదలైన ప్రదేశాల్లో ఉంటాయి. అందుకే ఇంటి చుట్టుపక్కల చెట్లు లేకుండా జాగ్రత్తలు తీసుకొవాలి. ముఖ్యంగా ఇంటి చుట్టురా కూడా పిచ్చి గడ్డి చెట్లు లేకుండా క్లీన్ గా ఉంచుకొవాలి.

2 /5

పొలాలకు, ఎక్కువగా ఉండే చోట చాలా మంది పాముల కాటుకు గురౌతుంటారు. పాములు ఒకవేళ కాటు వేస్తే.. వెంటనే గాయమైన భాగాన్నిసబ్బుతో కడిగేయాలి. ఆ తర్వాత..  గట్టి దారం లేదా సుతీలీ లేదా బట్టతో కట్టుకట్టాలి. వెంటనే ఎక్కువగా టెన్షన్ కు గురికాకుండా చూసుకొవాలి. వెంటనే డాక్టర్ దగ్గరకకు వెళ్లాలి.

3 /5

అయితే.. పాము కాటు జరిగితే.. అవకాశం ఉంటే.. కుట్టిన పాము ఫోటో లేదా అది ఎలా ఉంటుందో మాత్రం వైద్యులకు దాని ఆనవాళ్లు చెప్పాలి. దీంతో వారు పాముకాటుకు సరైన యాంటివెనమ్ ఇవ్వడానికి సరైన విధంగా అవకాశం ఉంటుంది. మరోవైపు విషపూరితమైన పాము కాటు వేస్తే రెండు గాట్లు పడతాయి. 

4 /5

విషంలేని పాములు కాటు వేస్తే.. అలర్జీ వచ్చిన మాదిరిగా ఎర్రని దద్దుర్లు చర్మంపై ఉంటాయి. కొంత మంది పాము కాటు వేస్తే దాని మీద దాడి చేసి కొరికి చంపుతుంటారు. ఇలాంటి పనులు అస్సలు చేయకూడదు.  పాముకాటుకు గురైతే కొంత మంది తమ నోటితో రక్తంను పీల్చి ఉమ్మివేస్తుంటారు. ఈ పిచ్చి పనులు పొరపాటున కూడా చేయకూడదు. కొన్నిసార్లు ఈ పనుల వల్ల మనిషి ప్రాణాలు సైతం పోయే ప్రమాదం కూడా ఉంటుంది.

5 /5

పాము విషం ముఖ్యంగా నాడీ వ్యవస్థ, రక్త ప్రసరణ వ్యవస్థల మీదచూపిస్తుంది. రక్తంలో పాము విషం కల్సిపోయి.. రక్తం సరఫరా ఈజీగా అవ్వకుండా గడ్డకట్టేలా చేస్తుంది. ఆ తర్వాత మనిషి శరీరంలో రక్త ప్రసరణ జరక్క.. గుండె ఆగిపోయి మనిషి మరణిస్తాడు. అందుకే వర్షాకాలంలో ఈ జాగ్రత్తలు పాటిస్తే పాముల కాటు నుంచి ఈజీగా బైటపడొచ్చు.