Add Zee Business As A Preferred Source
App

Montha Cyclone: మొంథా తుపాన్ ఎఫెక్ట్.. ఏకంగా 43 ట్రైన్లు రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం.. డిటెయిల్స్..

Written ByInamdar Paresh
Published: Oct 27, 2025, 04:18 PM IST|Updated: Oct 27, 2025, 04:20 PM IST

Railway department alerts due to montha cyclone: మొంథా తుపాన్ నేపథ్యలో రైల్వే శాఖ అప్రమత్తమైంది. ఈ క్రమంలో  ఏకంగా 43 ట్రైన్ లను క్యాన్షిల్ చేసింది. ముఖ్యంగా ఇప్పటికే ప్లాన్ లు చేసుకున్న  ప్రయాణికులు ఈ విషయాల్ని గమనించాలని సూచించింది.

Montha cyclone:1/6

మొంథా తుపాన్ ప్రభావం:

బంగాళ ఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంలా మారింది. ఈ  క్రమంలో బలమైన మొంథా తుపాన్ నేపథ్యంలో ఏపీ వ్యాప్తంగా  ప్రభుత్వం అలర్ట్ అయ్యింది.   

andhra pradesh:2/6

43 రైళ్లు రద్దు:

చంద్రబాబు నాయుడు అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా..  'మొంథా' తుపాను ప్రభావం ఆంధ్రప్రదేశ్ కోస్తా జిల్లాలపై ప్రారంభమైంది. తుపాను కారణంగా ఇప్పటికే పలు ప్రాంతాల్లో ఈదురుగాలులు వీస్తున్నాయి.  

south central railway:3/6

మొంథా ఎఫెక్ట్ రైళ్లు రద్దు:

 గడిచిన 6 గంటల్లో గంటకు 18 కిలోమీటర్ల వేగంతో పశ్చిమ వాయవ్య దిశగా కదులుతోంది. ప్రస్తుతం ఇది చెన్నైకి 520 కిలోమీటర్లు, కాకినాడకు 570 కిలోమీటర్లు, విశాఖపట్నంకు 600 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది.

east coast railway:4/6

తుపాన్ ప్రభావం:

ఈ క్రమంలో మొంథా తుపాన్ నేపథ్యంలో రైల్వే శాఖ అధికారులు సైతం అప్రమత్తమయ్యారు. ఈస్ట్ కోస్ట్ రైల్వే భారీ తుపాన్ నేపథ్యంలో హైఅలర్ట్ అయ్యింది. అక్టోబర్ 27,28,29 తేదీల్లో పలు మార్గాల్లో ట్రైన్ లను  రైళ్లను రద్దు చేసింది.

cyclone montha effect:5/6

సౌత్ సెంట్రల్ రైల్వే:

 ఈ జాబితాలో.. నేడు సోమవారం విశాఖ నుంచి హైదరాబాద్ వెళ్లాల్సిన గోదావరి ఎక్స్ ప్రెస్, సికింద్రాబాద్ వెళ్లాల్సిన గరీబ్ రథ్,  ఢిల్లీకి వెళ్తాల్సిన ఏపీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ లు ఉన్నాయి.  

montha cyclone effect:6/6

మొంథా సైక్లోన్:

దీనితో పాటు  విశాఖ తిరుపతి డబుల్ డెక్కర్ ఎక్స్ ప్రెస్ తో, పలు సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్, మెము, ప్యాసింజర్ రైళ్లు రద్దు చేస్తున్నట్లు ఈస్ట్ కోస్ట్ రైల్వే ఒక ప్రకటనలో వెల్లడించింది. మరింత సమాచారం కోసం అధికారిక వెబ్ సైట్ ను చూడాలని  రైల్వే అధికారులు తెలిపారు.