Montha Cyclone Photos: తీరం దాటిన మొంథా తుఫాను ధాటికి నదులు, చెరువులు ఉధృతంగా మారాయి. చెట్లు, కరెంట్ స్తంభాలు కూడా రహదారులపై కుప్పకూలిపోయాయి. అర్ధరాత్రి 12:30 సమయంలో మొంథా తుఫాను తీరం దాటింది. అయితే ధ్వంసమైన చెట్లు ఉధృతంగా మారిన నదుల ఫోటోలు చూద్దాం.
1/8మొంథా తుఫాన్ ఎఫెక్ట్ వల్ల ఏపీలోని పలు ప్రాంతాల్లో చెట్లు కుప్పకూలిపోయాయి. పలు కార్లు, బైకులు కూడా ధ్వంసం అయ్యాయి. భూభాగంపై బలహీన పడిన మొంథా తుఫాన్ వల్ల 24 గంటల పాటు ఏపీ, తెలంగాణ, ఒడిశా రాష్ట్రాలలో వర్షాలు కురుస్తున్నాయి.
2/8తుఫాన్ ధాటికి గంటకు 95 కిలోమీటర్ల వరకు వేగంతో ఈదురు గాలులు కొనసాగుతున్నాయి. గరిష్టంగా 105 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీయనున్నాయి. కోస్తా ఆంధ్రతోపాటు తెలంగాణలో జిల్లాలకు కూడా రెడ్ అలర్ట్ జారీ చేశారు.
3/8మొంథా ఎఫెక్ట్ శ్రీకాకుళం, విజయనగరం, గుంటూరు, కృష్ణ, బాపట్ల, పల్నాడు, కోనసీమ, తూగో, పగో జిల్లాలో భారీ వర్షాలు కురువనున్నాయి. కోనసీమ, కాకినాడ, ఉభయగోదావరి జిల్లాలో భారీ నుంచి అతిభారీ వర్షాలకు కురుస్తున్నాయి.
4/8ఇక ప్రకాశం జిల్లాలో ఎస్సీ పాలెం లో భారీ వేపచెట్టు కూడా కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి ప్రాణం లేదు. దీంతోపాటు జాతీయ రహదారిపై కూడా విద్యుత్ స్తంభాలు అల్లూరు జిల్లాలో పడిపోయాయి.
5/8ఐటీడీఏ పెట్రోల్ బంకు సమీపంలో కూడా పలు వృక్షాలు కుప్పకూలిపోయాయి. ఎర్రబాలెంలో నల్లవాగు నది ఉధృతంగా ప్రవహిస్తోంది. రహదారి మధ్యలో కూడా పలు నదులు ఉధృతంగా మారి పొంగి పొర్లుతున్నాయి.
6/8కొన్ని ప్రాంతాల్లో చెట్లు, కార్లు, బైకులు, విద్యుత్ స్తంభాలపై భారీ వృక్షాలు కుప్పకూలి పడిపోయాయి. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రాణ నష్టం వాటిల్ల లేదు కానీ కృష్ణ జిల్లాలో విద్యుత్ స్తంభాలపై చెట్లు పడిపోయాయి. దీంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది.
7/8అర్ధరాత్రి రహదారిపై కుప్పకూలిన భారీ వృక్షాలను సిబ్బంది ఎప్పటికప్పుడు సహాయక చర్యలు చేపట్టి తొలగించారు. విరిగిన చెట్లు విద్యుత్ స్తంభాలను పక్కకు తొలగిస్తున్నారు. చాలామంది ప్రజలను పునరావాస కేంద్రాలకు కూడా తరలించారు.
8/8ఈ మొంథా తుఫాన్ ఎఫెక్ట్ వల్ల భారీ చెట్లు, విద్యుత్ స్తంభాలు కూడా నేలమట్టం అయ్యాయి. నదులు కూడా ఈ తుఫాను ధాటికి పొంగి ప్రవహిస్తున్నాయి. సీఎం చంద్రబాబు నాయుడు సంబంధిత అధికారులను అలెర్ట్‌గా ఉండాలని ఆదేశించారు.