Add Zee Business As A Preferred Source
App

Moon Most Favorite Zodiac: చంద్రగ్రహానికి అత్యంత ఇష్టమైన రాశులు.. ఈ రాశులవారికి ఆపారమైన ధన లాభాలు!

Published: Sep 09, 2025, 09:57 AM IST|Updated: Sep 09, 2025, 09:57 AM IST

Moon Most Favorite Zodiac Signs: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చంద్రుడికి అత్యంత ఇష్టమైన రాశుల వారి ఎల్లప్పుడూ విశేషమైన ప్రయోజనాలు పొందుతారు. అంతేకాకుండా ఆర్థికంగా కూడా లాభపడే అవకాశాలున్నాయి.. అలాగే జీవితంలో ఎన్నడుగు పొందలేని ధన లాభాలు కూడా పొందుతారు. 

Moon Most Favorite Zodiac Signs: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చంద్రగ్రహానికి కూడా ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది. చంద్రగ్రహాన్ని మనసుకు కారకుడిగా భావిస్తారు. ఈ గ్రహం తల్లితో పాటు వ్యక్తి మానసిక స్థితిని ప్రభావితం చేస్తుంది. అలాగే ఈ గ్రహాన్ని శక్తివంతమైన గ్రహంగా కూడా చెప్పుకుంటూ ఉంటారు. ఈ చంద్ర గ్రహం శుభప్రదమైన గ్రహాల్లో ఒకటి కాబట్టి సంచారం చేసినప్పుడు అన్ని రాశుల వారిపై స్థానుకూలమైన ప్రభావం పడుతూ ఉంటుంది. అయితే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చంద్రుడు కొన్ని రాశుల వారికి ఎల్లప్పుడూ విశేషమైన ఫలితాలు అందిస్తాడు.

Rasi Phalalu In Telugu1/5

చంద్రుడు బలహీనంగా ఉంటే..

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం జాతకంలో చంద్రుడు బలహీనంగా ఉండడం వల్ల కొన్ని రకాల సమస్యలు వస్తూ ఉంటాయి. ముఖ్యంగా వ్యక్తి మానసిక వేదన అనుభవించే అవకాశాలు కూడా ఉంటాయి. అంతేకాకుండా మానసికంగా ఎన్నో రకాల సమస్యలు ఎదుర్కొని చేయాల్సిన పనులు చేయలేకపోతూ ఉంటారు. 

Moon Favorite Rasi Phalalu2/5

చంద్రుడి ఆశీస్సులు..

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని రాశుల వారికి చంద్రుడి ఆశీస్సులు ఎల్లప్పుడూ లభిస్తాయి. ముఖ్యంగా కర్కాటక రాశితో పాటు కన్య మరికొన్ని రాశుల వారికి చంద్రుడు ఎల్లప్పుడూ అద్భుతమైన ఫలితాలను అందిస్తాడు. అలాగే ఆర్థికపరమైన ఇబ్బందుల నుంచి కూడా విముక్తి కలిగిస్తాడు. ఇదిలా ఉంటే చంద్రుడికి అత్యంత ఇష్టమైన రాశులు ఇప్పుడు తెలుసుకుందాం.  

Moon Favorite Rasi Phalalu Telugu3/5

కన్యా రాశి

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. కన్యా రాశి వారికి చంద్రుడికి దగ్గర సంబంధం ఉంటుంది. కాబట్టి కన్యా రాశి వారికి ఎల్లప్పుడూ చంద్రుడి అనుగ్రహాన్ని అందిస్తాడు. అంతేకాకుండా విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ఆర్థికపరమైన ఇబ్బందుల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. అన్ని రకాల పనులు ఎంతో సులభంగా చేయగలుగుతారు.   

Moon Favorite 2025 Telugu Rasi Phalalu4/5

కర్కాటక రాశి 

కర్కాటక రాశిలో జన్మించిన వ్యక్తులకు కూడా చంద్రుడు ఎల్లప్పుడూ శుభ ఫలితాలను అందిస్తాడు. ముఖ్యంగా వీరు ఎల్లప్పుడు విజయం దిశగా వెళ్తారు.. భౌతిక ఆనందం విపరీతంగా పెరుగుతుంది. ముఖ్యంగా చంద్రుడి అనుగ్రహం వల్ల కర్కాటక రాశి వారు పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. అలాగే ఉల్లాసభరితమైన జీవితాన్ని కూడా పొందగలుగుతారు.  

Moon Favorite Telugu Rasi Phalalu5/5

వృషభ రాశి

చంద్రుడికి అత్యంత ఇష్టమైన రాశుల్లో వృషభ రాశి కూడా ఒకటి. ఈ రాశి వారికి ఎల్లప్పుడూ చంద్రుడు అనుగ్రహించి విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా సంపాదనతో పాటు శ్రేయస్సు విపరీతంగా పెరుగుతుంది. అలాగే చేయాలనుకున్న పనులు కూడా వెంటవెంటనే చేస్తారు. ముఖ్యంగా ఈ సమయంలో ఎన్నో రకాల లాభాలు కలుగుతాయి. కోరుకుంటున్న కోరికలు కూడా నెరవేరుతాయి.