Fatty Liver Reverse 5 Habits: ఇది వరకు ఫ్యాటీ లివర్ అంటే కేవలం ఆల్కహాల్ తాగేవారిలో మాత్రమే ఉంటుంది అనుకునేవారు. అయితే, కొన్ని నివేదికల ప్రకారం 80 శాతానికి పైగా ఐటీ ఉద్యోగుల్లో కూడా ఈ ఫ్యాటీ లివర్ ఉందట. ఇది మెటబాలిజం రేటుపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుంది. ఎక్కువ సమయంపాటు కూర్చొని పనిచేయడం, సరైన సమయానికి ఆహారం తీసుకోకపోవడం వంటివి ప్రధాన కారణాలు. అయితే, ఈ 5 అలవాట్లు ఉంటే ఫ్యాటీ లివర్ రివర్స్ చేయవచ్చు.
దాల్చిన చెక్క, నిమ్మరసం.. సాధారణంగా చాలామంది ఉదయం లెమన్ వాటర్ తాగమని చెబుతారు. నిజంగా ఇది ఎంతోగానో సహాయపడుతుంది. నిమ్మరసంతోపాటు దాల్చిన చెక్క పొడి కూడా కలిపి తీసుకుంటే మంచిది. ఇది రక్తసరఫరాను కూడా మెరుగు చేస్తుంది. ఉదయం పరగడుపున తీసుకోవాలి. దీన్ని రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల ఇన్సూలిన్ స్థాయిలు కూడా నియంత్రిస్తాయి. గోరువెచ్చని నీటిలో తాజా నిమ్మరసం, దాల్చిన చెక్క పొడి వేసుకుని తీసుకోవాలి.
యోగా.. దీంతోపాటు లివర్ ఆరోగ్యానికి సంబంధించిన యోగా కూడా సాధన చేయండి. ఇది కూడా లివర్‌లో కొవ్వు పేరుకోకుండా చేస్తుంది. భుజంగాసనం, మత్స్యాసనం, కపాలభాతి రోజూ ఓ 12 నిమిషాలు సధాన చేయాలి.
బీట్‌రూట్ జ్యూస్.. బీట్‌రూట్ క్యారట్‌లలో బీటానైన్, కెరోటెనాయిడ్స్ ఉంటాయి. ఇది ఆక్సిడేటివ్ స్ట్రెస్ నుంచి కాపాడతాయి. రెగ్యులర్‌గా బ్రేక్‌ఫాస్ట్ సమయానికి ఓ అరగం ముందు ఈ రెండిటి జ్యూస్ తీసుకోవడం వల్ల ఫ్యాటీ లివర్ క్లీన్ అవుతుంది.
వాల్నట్స్.. ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌లో వాల్నట్స్ తినండి. వీటిలో ఫైబర్ ఉంటుంది. ప్రాసెస్ చేసిన ఆహారాలకు వాల్నట్స్, అవిసె గింజలు వేసి నానబెట్టిన మిల్లెట్స్ తీసుకోండి. ఉసిరికాయ చటనీ కూడా కాలేయాన్ని రిపెయిర్ చేస్తుంది. ఇక వాల్నట్స్‌లో ఒమేగా 3S, గ్లైసెమిక్ సూచీ తక్కువగా ఉంటుంది కాబట్టి షుగర్ వ్యాధిగ్రస్థులకు కూడా సేఫ్.
సోంపు.. ఫ్యాటీ లివర్‌కు చక్కని మరో రెమడీ సోంపు నీరు. ఇది డీహైడ్రేషన్ గురికాకుండా చేస్తుంది. స్ట్రెస్ నుంచి కూడా బయటపడతారు. రెగ్యులర్‌గా సోంపుతో తయారు చేసిన నీటిని తీసుకోవడం వల్ల ఐటీ ఉద్యోగులు ఫ్యాటీ లివర్ సమస్య నుంచి బయటపడతారు. దీంతోపాటు దండేలియన్ టీ తీసుకోండి. ఇది కడుపులో గ్యాస్ అజీర్తిని కూడా తగ్గిస్తుంది.
సన్‌లైట్.. ఉదయం సహజంగా వచ్చే ఎండలో కాసేపు గడపండి. ఇది లివర్ ఎంజైమ్ యాక్టివిటీకి కూడా సహాయపడుతుంది. నిద్ర క్వాలిటీని కూడా పెంచుతుంది. హార్మోనల్ అసమతుల్యతను కూడా నియంత్రిస్తుంది. ఈ అలవాట్లు డిజిటల్ డిటాక్స్ లా పనిచేస్తాయి. (Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం. వీటిని పాటించే ముందు వైద్య సలహా తీసుకోవాలి. ఈ సమాచారాన్ని Zee Media ధృవీకరించలేదు)