Drumstick Leaves Powder : గుండెపోటు, ఒబిసిటి లాంటి సమస్యలు ప్రస్తుతం ఎక్కువైతున్నాయి. అయితే ఇలాంటి ఎన్నో సమస్యలకు మునగాకు పొడి మంచి చెక్ పెడుతుంది. అంతేకాకుండా.. మునగాకు పొడి వల్ల జుట్టు కూడా బాగా పెరుగుతుంది. మరి అలాంటి మునగాకు పొడిని ఎలా చేసుకోవాలంటే..
1/5మునగాకు పొడి..ఆరోగ్యానికి ఎంతో మంచిది.. ఈ పొడి తినడం వల్ల ఎన్నో సమస్యలకు చెక్ పెట్టవచ్చు. అన్నిటికన్నా ముఖ్యంగా జుట్టు ఊడిపోయే సమస్య ఉన్నవాళ్లకి ఈ పొడి ఎంతగానో పనికొస్తుంది.
2/5రోజు ఈ పొడి తో అన్నం తినడం వల్ల జుట్టు బాగా పెరుగుతుంది. ఇక ఈ పొడి చేసుకోవడానికి.. కేవలం ఐదు నిమిషాల కేటాయిస్తే చాలు. మరి ఈ ఆరోగ్యకరమైన పొడి ఎలా చేసుకోవాలంటే..
3/5ఒక స్పూన్ ఆయిల్, ఒక స్పూన్ పచ్చెనగపప్పు, ఒక స్పూన్ ఉద్దిపప్పు, ఒక స్పూన్ ధనియాలు, ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ మిరియాల పొడి, ఐదు ఎండుమిరపకాయలు, ఒకటిన్నర కప్పు మునగాకు, కొద్దిగా ఉప్పు, చింతపండు, ఇంగువ
4/5ముందుగా మునగాకు బాగా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఆ తరువాత నూనెలో పచ్చనగపప్పు, ఉద్దిపప్పు వేయించుకోవాలి. మిగతా పదార్థాలు అన్నీ కూడా వేసి కాసేపు ఉడకనివ్వాలి.. ఫైనల్ గా మునగాకు.. వేసి బాగా వేయించుకోవాలి.
5/5చల్లారాక మిక్సీ పట్టించుకోవాలి.. ఇందులోనే కొద్దిగా ఉప్పు, ఇంగువ కూడా వేసి మిక్సీ పట్టాలి. అంతే ఎంతో రుచికరమైన మునగాకు పొడి రెడీ.