Add Zee Business As A Preferred Source
App

Goddess Kali Favourite Zodiac: దీపావళి నుంచి పదేళ్లు ఈ రాశుల వారికి కాళికామాతా అనుగ్రహం.. వీరి శత్రువులు నామరూపం లేకుండా పోతారు!

Published: Oct 20, 2025, 10:04 AM IST|Updated: Oct 20, 2025, 10:04 AM IST


Goddess Kali Favourite Zodiac Signs In Telugu: దీపావళి నుంచి రాబోయే 10 సంవత్సరాల వరకు కొన్ని రాశుల వారికి కాళికామాత అనుగ్రహం లభిస్తుంది. దీనివల్ల ఈ క్రింది రాశుల వారు ఊహించని లాభాలు పొందుతారు. అలాగే ఆర్థికంగా కూడా వీరికి చాలావరకు కలిసి వస్తుంది.

Goddess Kali Favourite Zodiac Signs: ఈ సోమవారం చాలామంది కాళీదేవిని పూజిస్తూ ఉంటారు ఎందుకంటే ఈ సోమవారం అమావాస్య వచ్చింది. అందుకే ఈరోజు లక్ష్మీ అమ్మవారి తో పాటు కాలిక దేవిని పూజిస్తారు. అమ్మవారిని ఎంతో శక్తివంతమైన దేవతగా భావిస్తారు. అందుకే ఆమె అనుగ్రహం ఉంటే ఎలాంటి పనులైన సులభంగా చేయగలుగుతారు. అలాగే శత్రువుల బాధ నుంచి కూడా ఉపశమనం కలిగి.. అద్భుతమైన ప్రయోజనాలు పొందుతారని జ్యోతిష్యులు చెబుతున్నారు.
 

Zodiac Of Goddess Kali1/5

కాళికామాత

కాళికామాతను ఉగ్రరూపినిగా చెప్పుకుంటారు. ఆమె అనుగ్రహం ఉంటే మీ జీవితంలో ఎలాంటి బాధలు అయినా తొలగిపోతూ ఉంటాయి. ముఖ్యంగా శత్రువుల నుంచి ఉపశమనం కూడా కలుగుతూ ఉంటుంది. అలాగే మానసికంగా కూడా చాలావరకు కలిసి వస్తుంది. అయితే, కొన్ని రాశుల వారికి ఎల్లప్పుడూ కాళికామాత అనుగ్రహం లభిస్తుంది. దీనివల్ల ఆయా రాశుల వారి ఊహించని ప్రయోజనాల పొందుతారు.   

Zodiac Sign Of Goddess Sita2/5

మకర రాశి

కాళీ దేవికి ఎంతో ఇష్టమైన రాశుల్లో మకర రాశి కూడా ఒకటి. ఈ రాశి వారికి రాబోయే పది సంవత్సరాల పాటు ఆమె అనుగ్రహం లభిస్తుంది. కాబట్టి మీరు చేపట్టిన బలులు సులభంగా పూర్తి అవుతాయి. అంతేకాకుండా అన్ని పనుల్లో విజయాలు సాధించగలుగుతారు. విద్యార్థులు పోటీ పరీక్షల్లో రాణించగలిగి.. ఊహించని ఫలితాలు పొందుతారు. అలాగే ప్రేమ జీవితంలో బాధపడాల్సిన అవసరమే ఉండదు..  

Goddess Lakshmi Birth Star3/5

మిథున రాశి

మిథున రాశి వారికి కూడా కాళికాదేవి అనుగ్రహం లభిస్తుంది. తల్లి ఆశీర్వాదాలతో ఈ రాశి వారు ఊహించని లాభాలు పొందుతారు. ముఖ్యంగా కుటుంబంలో ఆనందం విపరీతంగా పెరుగుతుంది. అలాగే శాంతి వాతావరణం కూడా నెలకొని.. మానసిక ప్రశాంతతతో జీవిస్తారు. అలాగే డబ్బు కూడా రాకుండా ఉంటుంది. ఉద్యోగాలు చేసేవారు ఊహించని పదవులు పొందుతారు. 

Zodiac Sign Of Hindu Gods4/5

సింహరాశి 

కాళికామాత అనుగ్రహంతో 2035 సంవత్సరం వరకు సింహ రాశి వారికి ఎలాంటి లోటు ఉండదు. డబ్బు సంపాదించేందుకు వీరికి కొత్త కొత్త ఆదాయం మార్గాలు కూడా తెరుచుకుంటాయి. అలాగే వీరు ఆకస్మికంగా కూడా బోలెడు లాభాలు పొందుతారు. కొత్త ఉద్యోగాలు చేసే వారికి ఈ సమయం చాలా బాగుంటుంది. అలాగే కాళికామాత అనుగ్రహంతో ఊహించని లాభాలు పొందుతారు. 

Zodiac Sign Of Goddess Lakshmi5/5

కన్యారాశి 

కన్యరాశిలో జన్మించిన వ్యక్తులకు కూడా రాబోయే పది సంవత్సరాలు కాళికామాత అనుగ్రహం లభిస్తుంది. వీరికి ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవడమే కాకుండా.. ఎలాంటి పనులు చేపట్టిన అద్భుతమైన విజయాలు సాధించగలుగుతారు. కన్య రాశి వారికి కొన్ని రకాల ఇబ్బందుల నుంచి కూడా ఉపశమనం కలుగుతుంది. అలాగే వివాహ శుభకార్యాలలో కూడా పాల్గొంటారు. అనుకోకుండా అద్భుతమైన ప్రయోజనాలు పొందుతారు.