Vivo S50 Series Price: వివో నుంచి మార్కెట్‌లోకి S50 సిరీస్ మొబైల్స్ అందుబాటులోకి రాబోతున్నాయి. ఇవి అద్భుతమైన ఫీచర్లతో విడుదల కాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఈ మోడల్స్‌కు సంబంధించిన అన్ని వివరాలు సోషల్ మీడియాలో లీక్ అయ్యాయి.
Vivo S50 Series Price In India: కెమెరాల పరంగా వివో స్మార్ట్ ఫోన్స్‌కి పెట్టింది పేరు. అందుకే ఫోటో ప్రియులు ఎక్కువగా వివో మొబైల్స్ ను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతూ ఉంటారు. దీనిని దృష్టిలో పెట్టుకొని మార్కెట్లోకి కొత్త మొబైల్ సిరీస్‌ను విడుదల చేయబోతోంది. ఇది ఎస్ సిరీస్‌లో అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. గతంలో విడుదల చేసిన అన్ని మొబైల్స్ కంటే చాలా ప్రత్యేకంగా ఉండబోతున్నట్లు సమాచారం. ఈ ఎస్ సిరీస్‌కు సంబంధించిన ఫీచర్స్, స్పెసిఫికేషను వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Vivo స్మార్ట్ ఫోన్ S50 సిరీస్ పేరుతో మార్కెట్‌లోకి కొత్త మోడల్ మొబైల్స్ అందుబాటులోకి తీసుకురాబోతోంది. దీనిని ముందుగా కంపెనీ చైనాలో విడుదల చేసి ఆ తర్వాత ఇతర దేశాల్లో అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ మొబైల్ సంబంధించిన అధికారిక ప్రకటనను ఇంకా వెల్లడించలేకపోయినప్పటికీ.. సోషల్ మీడియాలో ఈ స్మార్ట్‌ఫోన్స్‌కు సంబంధించిన లీక్స్ మాత్రం విపరీతంగా వస్తున్నాయి.
Vivo S50 సిరీస్ స్మార్ట్‌ఫోన్స్‌ను వివో కంపెనీ భారత మార్కెట్‌లో డిసెంబర్ నెలలో విడుదల చేసే అవకాశాలున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అంతేకాకుండా ఈ S సిరీస్ మోడల్స్ అద్భుతమైన కెమెరాకు ప్రసిద్ధిగా చరిత్ర సృష్టించే అవకాశాలు ఉన్నట్లు మార్కెట్లో టెక్ నిపుణులు చర్చించుకుంటున్నారు.
అలాగే ఈ ఎస్ సిరీస్‌లో భాగంగా వివో ఎస్50 ప్రో మినీ మోడల్ కూడా అందుబాటులోకి రాబోతోంది. ఇది చాలా ప్రత్యేకమైన 6.31-అంగుళాల డిస్ప్లేని కలిగి ఉంటుంది. అంతేకాకుండా ప్రీమియం లుక్ లో అద్భుతమైన డిజైన్లు విడుదల కాబోతోంది. అలాగే ఇది చూడడానికి చాలా అద్భుతంగా ఉండబోతున్నట్లు సమాచారం.
ఈ మినీ మోడల్ గతంలో విడుదలైన యాపిల్స్ మినీ మోడల్స్ మొబైల్స్ లాగానే ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా యాపిల్స్ ఫీచర్స్ కంటే ఈ స్మార్ట్‌ఫోన్స్‌తలో ఎన్నో రకాల అద్భుతమైన కొత్త కొత్త ఫీచర్లు అందుబాటులో ఉండబోతున్నట్లు సమాచారం. ముఖ్యంగా కెమెరా పరంగా చాలా అద్భుతంగా ఉండే ఛాన్స్ ఉన్నట్లు మార్కెట్‌లో టాక్ నడుస్తుంది.
ఈ Vivo S50 మొబైల్ మోడల్స్‌కు సంబంధించిన ఫీచర్స్ వివరాలు మాత్రం లీక్ అయినప్పటికీ.. ధరను అంచనా వేయలేకపోయారు. ఇది గత మోడల్స్ కంటే కాస్త ఎక్కువ ధరనే ఉండే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఈ మోడల్స్‌లో ఎన్నో రకాల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ ఫీచర్లు ఉండే అవకాశాలు ఉండడం వల్ల దరఖాస్తు ఎక్కువగానే ఉండచ్చని సమాచారం.