Trending Business Idea: పుష్పరాజ్‌లా కోట్లు సంపాదించాలనుకుంటున్నారా? ప్రపంచంలోనే ది బెస్ట్‌ బిజినెస్‌ ఐడియా ఇదే.. నెలకు రూ. 4,00,000 లాభం

Cocopeat Business Idea: "పేదవాడిగా పుట్టడం తప్పు కాదు, పేదవాడిగా చనిపోవడం మాత్రం తప్పు" కోట్‌  గురించి వినుంటారు. ప్రస్తుతం బిజినెస్ ప్రపంచం చాలా మారిపోయింది. ధనవంతులకే అవకాశాలు అనే భావన పూర్తిగా మారిపోయింది. కొత్త ఆలోచనలు, కృషి, కొంచెం అదృష్టం ఉంటే ఎవరైనా సొంత వ్యాపారాన్ని స్థాపించి విజయం సాధించవచ్చు. బిజినెస్ ప్రారంభించడానికి కోట్ల రూపాయలు పెట్టుబడి అవసరం లేదు. చాలా చిన్న స్థాయిలో, తక్కువ పెట్టుబడితో ప్రారంభించి క్రమంగా వ్యాపారాన్ని విస్తరించుకోవచ్చు. చాలా మంది చిన్న వ్యాపారాలతో ప్రారంభించి కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు. ముఖ్యంగా ఆన్‌లైన్ వ్యాపారం ఈ విషయంలో చాలా అవకాశాలు ఇస్తోంది. ఈరోజు మీరు తెలుసుకొనే బిజినెస్ కేవలం కోట్లు సంపాదించడమే కాకుండా పర్యావరణాని రక్షించడంలో కూడా కీలక ప్రాత పోషిస్తారు. 
 

1 /10

పర్యావరణం, వ్యాపారం ఈ రెండూ మన జీవితాలకు అత్యంత ముఖ్యమైన అంశాలు. నేటి కాలంలో చాలా మంది వివిధ రకాల బిజినెస్‌లు చేస్తున్నారు. అందులో కొందరు పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకొని కొన్ని అద్భుతమైన లాభాలు పొందుతున్నారు. 

2 /10

ఈరోజు మీరు తెలుసుకొనే బిజినెస్‌ కోకో పీట్‌ వ్యాపారం. ఇది కొబ్బరి బోండాల నుంచి తీసిన ఒక సహజ సేంద్రీయ పదార్థమే కోకో పీట్. ఇది తేమను బాగా నిలుపుకునే గుణం కలిగి ఉండి, వ్యవసాయం, తోటపనినర్సరీలలో విస్తృతంగా ఉపయోగిస్తారు. ఇది మొక్కల వేర్లకు మంచి ఆధారాన్ని అందిస్తుంది, పోషకాలను నిలుపుకునే సామర్థ్యం కలిగి ఉంటుంది.

3 /10

ప్రపంచవ్యాప్తంగా సేంద్రీయ వ్యవసాయం పట్ల ఆసక్తి పెరుగుతున్న కారణంగా కోకో పీట్‌కు డిమాండ్ పెరుగుతోంది. అధిక నాణ్యత కలిగిన కోకో పీట్‌కు మంచి మార్కెట్ ఉంది. విదేశీ మార్కెట్లలో కోకో పీట్‌కు భారీ డిమాండ్ ఉంది.

4 /10

కోకో పీట్‌తో ఎన్నో రకాల వ్యాపారాలు చేయవచ్చు.  దీన్ని నేరుగా రైతులు, తోటమాలి, నర్సరీలకు విక్రయించవచ్చు.  కోకో పీట్‌ను ఉపయోగించి గ్రో బ్యాగ్‌లు, పాట్టీలు, కంపోస్ట్ మిశ్రమాలు వంటి ఉత్పత్తులను తయారు చేయవచ్చు.  

5 /10

ఈ ఉత్పత్తులను మొక్కలను పెంచడానికి ఉపయోగిస్తారు. కోకో పీట్‌ను హైడ్రోపోనిక్స్ సిస్టమ్‌లలో గ్రోయింగ్ మీడియాగా ఉపయోగించవచ్చు. ఈ సిస్టమ్‌లను విక్రయించడం ద్వారా లేదా హైడ్రోపోనిక్స్ పంటలను పెంచి విక్రయించడం ద్వారా లాభం పొందవచ్చు.  

6 /10

కోకో పీట్ బిజినెస్‌ను ప్రారంభించడానికి ముందుగా మొదటి దశలో చిన్న స్థాయిలో ప్రారంభించవచ్చు. ఈ బిజినెస్‌ కోసం  కొబ్బరి బోండాలు అందుబాటులో ఉండాలి.  కోకో పీట్‌ను తయారు చేయడానికి అవసరమైన యంత్రాలు. కోకో పీట్ మెషిన్‌ ధర కిల్లో బట్టి ఉంటుంది. 

7 /10

కోకో పీట్  మెషిన్‌ కొనుగోలు చేయడానికి మీ వద్ద డబ్బులు లేకపోతే ప్రధానమంత్రి ముద్ర యోజన పథకం కింద లోన్‌ తీసుకోవచ్చు. ఈ లోన్‌లో ఎలాంటి వడి ఉండదు కాబట్టి సులువుగా మీ బిజినెస్‌ను ప్రారంభింవచ్చు. ఈ డబ్బుతో ఇతర ముడి పదార్థాలు కొనుగోలు చేయవచ్చు. 

8 /10

కొబ్బరి తోటలు ఉన్నవారికి ఈ బిజినెస్‌ ఒక వరం. ఈ బిజినెస్‌తో రూ. 70,000 నుంచి రూ. 100,000 ఎకరం బట్టి సంపాదింవచ్చు. అనేది మీరు ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసి ప్రొడెక్ట్సలను తయారు చేసి అమ్ముతే లక్షల్లో ఆదాయం పొందవచ్చు.   

9 /10

కోకో పీట్‌ బిజినెస్‌ ప్రారంభించడానికి మీకు పెట్టుబడి రూ. 60,00,00 అవుతుంది. దీంతో మీరు నెలకు రూ. 4,00,000 లాభం పొందుతారు. ఈ బిజినెస్ ను మరింత ముందుకు తీసుకెళ్లడం కోసం సోషల్‌ మీడియాను కూడా ఉపయోగించవచ్చు. 

10 /10

మీరు కొత్త బిజినెస్‌ ప్రారంభించడానికి ఇది ఒక మంచి వ్యాపారం. అయితే ఏదైనా బిజినెస్‌ ప్రారంభించే ముందు బిజినెస్‌పైన అవగాహన, పెట్టుబడి గురించి ప్లాన్‌ చేసుకోవడం ముఖ్యం.