Add Zee Business As A Preferred Source
App

Mouni Roy: చీరకట్టులో మౌనీరాయ్ గ్లామర్ ట్రీట్.. ఓనమ్ చీరలో అదుర్స్ అనిపిస్తున్న నాగిని భామ..

Written ByTA Kiran Kumar
Published: Sep 06, 2025, 01:34 PM IST|Updated: Sep 06, 2025, 01:34 PM IST

Mouni Roy: మౌనీ రాయ్.. ఎపుడు తన అంద చందాలతో గ్లామర్ తో ప్రేక్షకులను అలరిస్తుంది. తాజాగా ఓనం పండగ సందర్భంగా ఈమె తెల్ల చీరలో సాంప్రదాయ బద్దంగా కనిపిస్తూనే అభిమానులు కవ్విస్తూనే ఉంది. 

Mouni Roy1/6

మౌనీ రాయ్

Mouni Roy: పేరుకు పంజాబీ భామ అయిన ఈమె సినిమాల్లో కంటే తన గ్లామర్ తో మోస్ట్  పాపులర్ అయింది. ముఖ్యంగా 'నాగిని' సీరియల్‌లో తన యాక్టింగ్ కంటే స్కిన్ షోతో ఆడియన్స్ ను  ఫిదా చేసింది. స్మాల్ స్క్రీన్‌ నుంచి  సిల్వర్ స్క్రీన్ పై తన గ్లామర్ తో  ప్రేక్షకులకు కంటిమీద కునుకు లేకుండా చేయడం ఈమె స్పెషాలిటీ. 

Mouni Roy Onam Celebrations 2/6

మౌనీ రాయ్ ఓనం సెలబ్రేషన్స్

తాజాగా మౌనీ రాయ్.. కేరళీయుల పండగ అయిన ఓనం సందర్బంగా తెల్లచీరలో సంప్రదాయ బద్దంగా కనిపిస్తూనే నడుము వయ్యారాలతో సోషల్ మీడియాను హీట్ ఎక్కించింది.  

Seriels Popularity 3/6

సిరీయల్స్ తో పాపులారిటీ

మౌనీ రాయ్ సినిమాల కంటే ముందుగా సీరియల్స్ తో పాపులర్ అయింది. ముఖ్యంగా  హిందీలో తెరకెక్కిన పలు సీరియల్స్ ద్వారా ఆడియన్స్ మనుసు దోచుకుంది. అంతేకాదు స్మాల్ స్క్రీన్ పై వచ్చిన పాపులారిటీతో వెండితెరపై  తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. 

Kyu ki Saas Bhi Kabhi Bahu Thi 4/6

క్యూ కీ సాస్ బీ కభీ బహు తీ

మౌనీరాయ్.. 2006లో 'క్యూ కీ సాస్ బీ కభీ బహు తీ' సీరియల్‌తో నటిగా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత తెరకెక్కిన 'నాగిని' సీరియల్‌తో ఓవర్ నైట్ ఈమె పాపులారిటీ ఎక్కడికో వెళ్లిపోయింది. నాగిని సీరియల్‌తో వచ్చిన పాపులారిటీతో వరుసగా మూవీల్లో ఛాన్సెస్ కొట్టేసింది. మొదటిసారి ఈమె పంజాబీ చిత్రం 'హీరో హిట్లర్ ఇన్ లవ్' సినిమాతో కథానాయికగా వెండితెర తెరంగేట్రం చేసింది.  

Mouni Bollywood Entry 5/6

మౌనీ బాలీవుడ్ ఎంట్రీ

కెరీర్ మొదట్లో పంజాబీ సినిమాల్లో నటించిన మౌనీ రాయ్.. ఆ తర్వాత హిందీ చిత్రాల్లో తన లక్  పరీక్షించుకుంది. 2018లో అక్షయ్ కుమార్ యాక్ట్ చేసిన  'గోల్డ్' చిత్రంతో  బాలీవుడ్ చిత్రసీమలో ఎంట్రీ ఇచ్చింది.  

Mouni Roy Movies 6/6

మౌనీ రాయ్ మూవీస్

హిందీలో  ‘తుమ్ బిన్ 2’, సౌత్ లో ‘కేజీఎఫ్’ సినిమాలో ఐటెం సాంగ్‌లో యాక్ట్ చేసి  నార్త్ టూ సౌత్ అన్ని ఇండస్ట్రీస్ జనాలను  తనపైపు తిప్పుకుంది. అంతేకాదు అప్పట్లోనే టీవీ నటిగా హైయ్యెస్ట్ రెమ్యునరేషన్ తీసుకునే స్థాయికి చేరుకుంది మౌనీ రాయ్. త్వరలో చిరంజీవి హీరోగా నటిస్తున్న ‘మన శంకర వర ప్రసాద్’ చిత్రంలో ఐటెం భామగా తెలుగు ప్రేక్షకులను పలకరించబోతుంది.