Add Zee Business As A Preferred Source
App

MD Dhoni Rolls Royce Car: రాంచీ వీధుల్లో ధోని రోల్స్ రాయిస్ ర్యాంపేజ్.. మహేంద్రుడి గ్యారేజీలో ఉన్న లగ్జరీ కార్ల ధర ఎంతో తెలుసా.?

Written ByBhoomi
Published: Sep 08, 2025, 03:36 PM IST|Updated: Sep 08, 2025, 03:36 PM IST

MS Dhoni Car Collection 2025: భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీకి బైకులు, కార్లు అంటే చాలా ఇష్టమన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ధోనీ మరోసారి వార్తల్లో నిలిచారు. తాజాగా ధోనీ దగ్గర ఉన్న కార్ కలెక్షన్ గురించి సోషల్ మీడియాలో జోరుగా చర్చ జరుగుతోంది. ఎంఎస్ ధోనీ ఈమధ్యే జార్ఖండ్ రాజధాని రాంచీ వీధుల్లో వింటేజ్ రూల్స్ రాయిస్ కారు నడుపుతూ కనిపించడం వైరల్ అయ్యింది. ధోని తన ఫాంహౌజ్ నుంచి కారును బయటకు తీసిన వెంటనే ఫ్యాన్స్ ఆయన కారు వెంట పరుగులు పెట్టారు. ధోనీ ధోనీ అంటూ అరుస్తూ రూల్స్ రాయిస్ కారును ఛేజ్ చేసి ప్రయత్నం చేశారు. 

Rolls-Royce Silver Shadow1/10

రోల్స్ రాయిస్ సిల్వర్ షాడో

రోల్స్ రాయిస్ సిల్వర్ షాడో

ధోనీ వింటేజ్ కార్లను ఎంతగా ఇష్టపడతాడో ఆయన వద్ద ఉన్న రోల్స్ రాయిస్ సిల్వర్ షాడో చాటి చెబుతుంది. దీని మార్కెట్ విలువ సుమారు రూ.1.5 కోట్లు. రాంచీ రోడ్లపై ఈ కారు నడుపుతున్నప్పుడు ధోనీని చూసిన అభిమానులు ఆనందంలో మునిగిపోయారు. 

Mercedes AMG G632/10

మెర్సిడెస్ AMG G63

మెర్సిడెస్ AMG G63

‘కెప్టెన్ కూల్’ దగ్గర ఉన్న మరో ప్రత్యేక వాహనం మెర్సిడెస్ AMG G63. ప్రత్యేక గ్రీన్ పెయింట్ స్కీమ్, శాటిన్ బ్లాక్ ర్యాప్, 20 అంగుళాల మ్యాట్ బ్లాక్ అల్లాయ్ వీల్స్‌తో ఈ SUV మరింత స్టైలిష్‌గా మారింది. దీని ధర సుమారు రూ.3.3 కోట్లు.  

Nissan Jongra Army Jeep3/10

నిస్సాన్ జోంగ్రా ఆర్మీ జీప్

నిస్సాన్ జోంగ్రా ఆర్మీ జీప్

భారత సైన్యంలో లెఫ్టినెంట్ కల్నల్ ర్యాంక్ కలిగిన ధోనీకి ఆర్మీ వాహనాలంటే కూడా ఇష్టం. ఆయన దగ్గర అరుదైన నిస్సాన్ జోంగ్రా ఆర్మీ జీప్ ఉంది. 20 ఏళ్ల వయసు గల ఈ వాహనం పంజాబ్‌లోని ఒక వ్యక్తి నుండి కొనుగోలు చేసి, ఆధునీకరించబడింది.  

Jeep Grand Cherokee Trackhawk4/10

జీప్ గ్రాండ్ చెరోకీ ట్రాక్‌హాక్

జీప్ గ్రాండ్ చెరోకీ ట్రాక్‌హాక్

707 bhp పవర్‌తో దూసుకెళ్లే ఈ SUV ధర సుమారు ₹1 కోటి. సాక్షి ధోనీ ఈ కారు ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఒకప్పుడు వైరల్ అయ్యింది.  

Ferrari 599 GT5/10

ఫెరారీ 599 GT

ఫెరారీ 599 GT

క్రీడా వాహనాలను కూడా ఇష్టపడే ధోనీ వద్ద ఫెరారీ 599 GT ఉంది. దీని ధర మార్కెట్లో సుమారు  రూ. 1.4 కోట్లు.  

Porsche 9116/10

పోర్స్చే 911

పోర్స్చే 911

ధోనీ కార్ల లిస్ట్‌లో ప్రఖ్యాత పోర్స్చే 911 కూడా ఉంది. దీని ధర రూ.2.5 కోట్లు. స్పోర్ట్స్ కార్లలో ఇది ఒక ప్రత్యేక స్థానం కలిగి ఉంది.  

Land Rover Freelander-27/10

ల్యాండ్ రోవర్ ఫ్రీలాండర్-2

ల్యాండ్ రోవర్ ఫ్రీలాండర్-2

ధోనీ SUVలంటే ఎంత ఇష్టమో ల్యాండ్ రోవర్ ఫ్రీలాండర్-2 కూడా చెబుతుంది. దీని ధర రూ.45–50 లక్షల మధ్య ఉంటుంది.

Pontiac Firebird Trans Am8/10

పోంటియాక్ ఫైర్‌బర్డ్ ట్రాన్స్ యామ్

పోంటియాక్ ఫైర్‌బర్డ్ ట్రాన్స్ యామ్

1970 నాటి వింటేజ్ అమెరికన్ మసిల్ కార్లలో ఒకటైన పోంటియాక్ ఫైర్‌బర్డ్ ట్రాన్స్ యామ్ కూడా మహి గ్యారేజీలో ఉంది. దీని విలువ దాదాపు రూ.80 లక్షలు.

aadiQ79/10

ఆడి Q7

ఆడి Q7

లగ్జరీ కార్లలో అత్యంత ప్రాచుర్యం పొందిన ఆడి Q7 కూడా ధోనీ దగ్గర ఉంది. దీని ధర సుమారు రూ.1 కోటి.  

hammar h210/10

హమ్మర్ H2

హమ్మర్ H2

బలమైన రూపం, శక్తివంతమైన ఇంజిన్‌తో ప్రసిద్ధి పొందిన హమ్మర్ H2 కూడా ధోనీ సేకరణలో ఉంది. దీని ధర రూ.75–80 లక్షల మధ్య ఉంటుంది.