Mushroom Pepper Fry Recipe: రుచికరమైన సౌత్ ఇండియన్ స్టైల్ మష్రూమ్ పేప్పర్ ఫ్రై.. మష్రూమ్ ఆరోగ్యకరం డయాబెటిస్ వారికి కూడా మంచిది. మష్రూమ్‌తో కూర తయారు చేసుకుంటారు. దీంతో సూప్ కూడా రెడీ చేసుకోవచ్చు. అయితే దీంతో ఈరోజు మనం మష్రూమ్ పెప్పర్ ఫ్రై రెసిపీ తెలుసుకుందాం. ఇది ప్రధానంగా సౌత్ ఇండియన్ స్టైల్ లో మష్రూమ్ కర్రీ వేసి తయారు చేసుకుంటే టేస్టీగా ఉంటుంది.
1/5మష్రూమ్ కర్రీ సౌత్ ఇండియన్ స్టైల్లో తయారు చేసుకోవడం రుచికరంగా ఉంటుంది. ఇందులో ఉల్లిపాయలు, మిరియాలు, కరివేపాకు వేసి స్పైసీగా తయారుచేస్తారు. దీనికి మనం చపాతీతో కలిపి తీసుకుంటే బాగుంటుంది.
2/5కావలసిన పదార్థాలు.. ఓ పావు కిలో మష్రూమ్స్, ఉల్లిపాయ-1, టమాటా-1, పచ్చిమిర్చి-2, అల్లం వెల్లుల్లి ఒక టేబుల్ స్పూన్, మిరియాల పొడి ఒక టేబుల్ స్పూన్, పసుపు, పావు టీ స్పూన్, కరివేపాకు, టేబుల్ స్పూన్ల నూనె, ఉప్పు రుచికి సరిపడా, కొత్తిమీర.
3/5మొదట ఒక కడాయి తీసుకొని అందులో నూనె పోసి కరివేపాకు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి దోరగా వేయించండి. ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్టు వేసి వేయించండి. పచ్చి వాసన పోయిన తర్వాత టమాటా కూడా వేసి బాగా మగ్గనివ్వండి.
4/5ఇప్పుడు అందులోనే మష్రూమ్స్, పసుపు, ఉప్పు వేసి కూరలో నుంచి నీరు విడుదల అయ్యేవరకు బాగా మగ్గించుకోండి. ఆ తర్వాత పైనుంచి మిరియాల పొడి కూడా వేసి బాగా కలపండి.
5/5చివరిగా కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకోండి. అప్పుడు రుచికరమైన మష్రూమ్ కర్రీ తయారైనట్టే. దీన్ని చపాతీలో వేడివేడిగా తీసుకోవడం వల్ల రుచి అదిరిపోతుంది. ఈసారి రెగ్యులర్ మష్రూమ్ కర్రీ కాకుండా ఇలా తయారు చేయండి.