Naga Chaitanya : నాగచైతన్య, సమంత విరాకులు తీసుకుని ఎన్నో సంవత్సరాలు కావస్తున్నా కానీ.. ఇంకా అందరి దృష్టి వారిపైనే ఉంది. విడాకులు తీసుకున్న తర్వాత నాగచైతన్య వేరే పెళ్లి కూడా చేసుకున్నారు. అయినా కానీ నాగచైతన్య సమంత గురించి చెప్పే వ్యాఖ్యలు ఎప్పుడు వార్తల్లో నిలుస్తూ ఉంటాయి.
నాగచైతన్య, సమంత తెలుగు సినిమా ఇండస్ట్రీ హిట్ జంటలో.. ఒకరు. వీరిద్దరూ కలిసి నటించిన ఎన్నో సినిమాలు మంచి విజయాన్ని అందుకున్నాయి. అంతేకాకుండా వీరిద్దరూ పెళ్లి బంధంతో నిజ జీవితంలో కూడా ఒకటయ్యారు. అయితే కొన్ని విభేదాల వల్ల వీరిద్దరూ కొన్ని సంవత్సరాల క్రితమే విడాకులు తీసుకున్నారు.
వీరిద్దరూ విడాకులు తీసుకున్న తరువాత.. నాగచైతన్య ఈమధ్యనే శోభితాని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. మరోపక్క సమంత ఫ్యామిలీ మ్యాన్ దర్శకుడు రాజుతో ప్రేమలో ఉంది అనే వార్తలు చెక్కర్లు కొడుతున్నాయి.
అయితే ఈ విషయం గురించి సమంత ఇప్పటి వరకు స్పష్టత ఇవ్వలేదు. కానీ వీరిద్దరూ కలిసి తీయించుకుంటున్న ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ అందరిలోనూ అనుమానాలు తీసుకువస్తున్నాయి.
ఈ క్రమంలో నాగచైతన్య గతంలో సమంత గురించి చేసిన కొన్ని వ్యాఖ్యలు సైతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అసలు విషయానికి వస్తే లవ్ స్టోరీ సినిమా టైంలో.. సాయి పల్లవి తో కలిసి నాగచైతన్య రానా టాక్ షో కి వెళ్లారు..
ఆ షోలో నాగచైతన్యాన్ని రానా ఎన్నో ప్రశ్నలు అడిగారు. ఇక ఆ షో లోనే.. సోషల్ మీడియా టిప్స్ కావాలి అంటే నువ్వు ఎవరి దగ్గర నుంచి తీసుకుంటావు అని అడగగా.. నాగచైతన్య వెంటనే అలాంటి టిప్స్ నేను సమంత దగ్గర నుంచి తీసుకుంటాను అని.. ఆమెకే ఫోన్ చేస్తాను అని.. చెప్పుకొచ్చారు. సమంత తరచూ సోషల్ మీడియాలో ఆక్టివ్ గా ఉంటుందన్న సంగతి తెలిసిందే. ఇక ఈ విషయాన్ని ఉద్దేశించే నాగచైతన్య ఈ వ్యాఖ్యలు చేశారు.