Naga Chaitanya good news: నాగచైతన్య, శోభిత ఈ మధ్యనే పెళ్లి చేసుకుని ఒకటైన సంగతి తెలిసిందే. పెళ్లయిన తర్వాత ఇద్దరూ కూడా.. వివిధ దేశాలకు తిరుగుతూ ఆ ఫోటోలు ఇంస్టాగ్రామ్ గా షేర్ చేస్తూ అందరిని అలరిస్తూ వచ్చారు. ఈ క్రమంలో ఇప్పుడు నాగచైతన్య పెట్టిన ఒక పోస్ట్ అందరిని తెగ ఆకట్టుకుంటుంది.
వీరిద్దరూ ఇంటర్వ్యూలు సైతం ఇంటర్నేషనల్ మ్యాగజైన్స్ లో వైరల్ అవుతుంది అందరిని ఆకట్టుకుంటూ వచ్చాయి. ఈ క్రమంలో నాగచైతన్య చేసిన ఒక పోస్ట్ ఇంస్టాగ్రామ్ లో తెగ వైరల్ అవుతుంది.
నాగ చైతన్య.. ఇంస్టాగ్రామ్ లో ఫోటోలు షేర్ చేస్తూ.. ఆయన స్కుజి పేరుతో.. కొత్తగా ఫుడ్ బిజినెస్ ప్రారంభించినట్లుగా ప్రకటించారు. ప్రపంచంలో ఉన్న అన్ని రుచులను.. తెలుగు వారికి చూపించడానికి.. షోయుని పరిచయం చేస్తున్నట్లు.. దానికి స్కూటీ కొనసాగింపు అన్నట్టు చైతూ తెలిపారు. మీ ప్రేమ, ఆదరణ మాపై ఉండాలని.. ఈ విషయం తాను ఎంతో ఎక్సైట్మెంట్ తో చెబుతున్నాను అని నాగచైతన్య సుదీర్ఘంగా ఇంస్టాగ్రామ్ లో ఒక పోస్ట్ పెట్టారు.
అలాగే ఈ పోస్ట్ తో పాటు కిచెన్‌ను, అక్కడ తయారవుతున్న వెరైటీలకి సంబంధించి ఫొటోలని కూడా ఇంస్టాగ్రామ్ లో షేర్ చేశాడు. ఇక ఈ పోస్ట్ ని శోభిత కూడా షేర్ చేసింది. కాగా చైతూ, శోభితల పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది.
మొత్తానికి పెళ్లయిన నాలుగు నెలల్లోనే మరో కొత్త బిజినెస్ స్టార్ట్ చేసి.. గుడ్ న్యూస్ చెప్పేశాడు నాగచైతన్య.