Naga Chaitanya: ఆమె ఇచ్చిన తొలిముద్దు ఎప్పటికీ మర్చిపోలేను.. మధుర జ్ఞాపకాలను బయటపెట్టిన నాగచైతన్య

Naga Chaitanya first kiss: అక్కినేని నాగ చైతన్య తన తొలిముద్దు అనుభవాన్ని షేర్ చేసుకున్నారు. నాగ చైతన్య వ్యక్తిగత జీవితం ఎప్పుడూ అభిమానులకు ఆసక్తికరమే. ఆయన షేర్ చేసిన తొలి ముద్ద అనుభవం మరోసారి వైరల్ కావడం గమనార్హం. పూర్తి వివరాల్లోకి వెళితే..  

1 /5

అక్కినేని కుటుంబానికి చెందిన యంగ్ హీరో నాగ చైతన్య టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇటీవల తండేల్ మూవీ ద్వారా మంచి విజయాన్ని అందుకున్నాడు. ఈ సినిమాలో మత్యకారుడిగా కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. నటనతోనే కాకుండా, వ్యక్తిగత జీవితంతో కూడా ఎప్పుడూ వార్తల్లో ఉంటున్నాడు.    

2 /5

చైతన్య మొదట స్టార్ హీరోయిన్ సమంతను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. కానీ కొన్ని కారణాల వల్ల ఇద్దరూ విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత ఆయన పేరు శోభిత ధూళిపాళతో లింక్ అయింది. చాలా కాలం రిలేషన్ ని సీక్రెట్ గా ఉంచిన వీరిద్దరూ చివరికి పెళ్లి చేసుకున్నారు. 

3 /5

ఇటీవల రానా నిర్వహించిన ఓ టాక్ షోలో నాగ చైతన్య పాల్గొన్నారు. ఆ షోలో రానా ఆసక్తికరమైన ప్రశ్నలు అడిగాడు. "నీ తొలి ముద్దెప్పుడు? ఎవరికి ఇచ్చావు?" అని అడిగిన ప్రశ్నకు చైతన్య స్పందిస్తూ, తొమ్మిదో తరగతిలో ఓ అమ్మాయికి తొలిముద్దు ఇచ్చిన విషయాన్ని గుర్తుచేసుకున్నాడు.  

4 /5

ఆ ముద్దు తన జీవితంలో మర్చిపోలేని అనుభూతి అని చెప్పాడు. తన యవ్వన దశలో జరిగిన ఆ సంఘటన ఓ ప్రత్యేకమైన జ్ఞాపకమని పేర్కొన్నాడు. ఇంకా షోలో అభిమాని అడిగిన మరో ప్రశ్నకు చైతన్య నవ్వుతూ సమాధానం ఇచ్చాడు. "మీరు సమంత కంటే తెల్లగా ఉన్నారని ఒక అభిమాని మీకు చెప్పాడని వినిపించింది. అది నిజమేనా?" అని అడగ్గా, "అది నా జీవితంలో మర్చిపోలేని సంఘటన" అంటూ నవ్వేశాడు. 

5 /5

ఈ టాక్ షోలో చైతన్య చెప్పిన మాటలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఈ వ్యాఖ్యలపై అభిమానులు రకరకాలుగా స్పందిస్తున్నారు. కొందరు "క్యూట్ స్టోరీ" అంటూ కామెంట్లు చేస్తుండగా, మరికొందరు "అసలు ఎవరు నాగచైతన్య ముద్దుపెట్టిన మొదటి అమ్మాయి?" అని ఆసక్తిగా ప్రశ్నిస్తున్నారు.  ప్రస్తుతం నాగ చైతన్య కొత్త ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్నాడు. త్వరలోనే మరో సినిమా అనౌన్స్ చేయనున్నాడు. తన కెరీర్‌లో కొత్త ప్రయోగాలు చేస్తూ ప్రేక్షకులకు మంచి సినిమాలు అందించాలని భావిస్తున్నాడు.