Naga Chaitanya: శోభితను ఎంతో ఇష్టమైన ప్రదేశానికి తీసుకెళ్ళిన నాగచైతన్య..రొమాంటిక్ ఫోటోలు షేర్ చేస్తూ..!

Naga Chaitanya Sobhita photos: నాగచైతన్య, శోభిత తమ ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసిన ఫోటోలు ప్రస్తుతం తెగ వైరల్ అవుతుంది అందరిని ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా నాగచైతన్య తనకు ఎంతో ఇష్టమైన చోటుకి శోభితాను తీసుకువెళ్లడం అందరిని ఆకట్టుకుంటుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

1 /5

టాలీవుడ్ హీరో నాగ చైతన్య, ఆయన భార్య శోభిత ధూళిపాళా తాజాగా తమ ఆనందకరమైన క్షణాలను.. అభిమానులతో పంచుకున్నారు. ఇటీవల, ఈ జంట రేసింగ్ ట్రాక్‌లో గడిపిన సమయాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయడం విశేషం.

2 /5

నాగ చైతన్యకు రేసింగ్ మీద ఆసక్తి ఎక్కువ. ఈ కారణంగా, ఆయన తనకు ఎంతో ఇష్టమైన.. రేసింగ్ ట్రాక్‌కు శోభితను తీసుకెళ్లారు. అక్కడ వారిద్దరూ రేసింగ్ కార్లను స్వయంగా డ్రైవ్ చేయడం, ఒకరినొకరు ఫొటోలు తీయడం వంటి సంఘటనలు.? అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.  

3 /5

ఈ ఫొటోల్లో శోభిత తన భర్త చైతన్యను ఎంతో ప్రేమగా చూస్తూ ఉన్న ఫోటో ఒకటి ప్రత్యేక ఆకర్షణగా మారింది. ఇదే కాదు, వారు ఒకరితో ఒకరు సరదాగా సమయం గడిపిన క్షణాలు సోషల్ మీడియాలో షేర్ చేయడంతో.. అవి కాస్త వైరల్ అవుతున్నాయి.  

4 /5

మార్చి 7న శోభిత ధూళిపాళా ఇన్‌స్టాగ్రామ్‌లో కొన్ని వెకేషన్ ఫోటోలను కూడా పంచుకున్నారు. ఈ ఫోటోలలో.. వీరిద్దరూ ఎంతో ప్రేమగా అన్యోన్యంగా కనిపించి అభిమానులను మరింత ఆకట్టుకున్నారు.  

5 /5

కొంత కాలం ప్రేమలో ఉన్న నాగ చైతన్య, శోభిత ధూళిపాళా 2024 డిసెంబర్‌లో హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో వైభవంగా వివాహం చేసుకున్నారు.  ప్రస్తుతం నాగ చైతన్య తన తాజా చిత్రం తాండెల్తో బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్నారు. చందూ మొండేటి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా, సాయి పల్లవి ప్రధాన పాత్రలో నటించింది.