Add Zee Business As A Preferred Source
App

Sobhita Dhulipala: చైతు కొంప ముంచిన శోభిత..!.. నోట్లో సిగరెట్, చేతిలో గన్‌తో రచ్చ.. నెట్టింట మళ్లీ దుమారం..

Written ByInamdar Paresh
Published: Apr 23, 2025, 10:18 PM IST|Updated: Apr 23, 2025, 10:21 PM IST

Sobhita Dhulipala: అక్కినేని కోడలు శోభిత ధూళిపాళ మరో వివాదంలో చిక్కుకుంది. ఇటీవల చేసిన ఒక ఫోటో షూట్ పై నెట్టింట ట్రోలింగ్ జరుగుతుంది. దీనిపై నెటిజన్లు అక్కినేని ఇజ్జత్ తీశావంటూ కూడా కామెంట్లు చేస్తున్నారు.

Sobhita Dhulipala: 1/5

శోభిత ధూళిపాళ కాంట్రవర్సీ:

అక్కినేని కోడలు శోభిత ప్రస్తుతం వివాదంలో చిక్కుకుంది. గతేడాది చైతు, శొభితలు ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. కొద్ది మంది అభిమానులు, బంధువుల మధ్య వీరి పెళ్లి గ్రాండ్ గా జరిగింది. ఈ క్రమంలో ప్రస్తుతం శొభిత, చైతులు సమ్మర్ వెకెషన్ లో ఛిల్ అవుతున్నారు.   

Nagachaitanya and sobhita Dhulipala:2/5

శోభితా ధూళిపాళ లేటెస్ట్ న్యూస్ :

మరోవైపు చైను పెళ్లి చేసుకున్న వేళా విశేషం నేపథ్యంలో చైతుకు తండేల్ రూపంలో మంచి హిట్ దొరికిందని కూడా నాగార్జున తన కోడలిపై ప్రశంసలు కురపించిన విషయం తెలిసిందే.   

sobhita controversy:3/5

నాగచైతన్య:

కొన్నిరొజులుగా చైతు, శోభితలో యూరప్ కు సమ్మర్ వెకెషన్ కు వెళ్లారు. ఆ తర్వాత తమిళనాడులోకి కొన్ని ఆలయాలను కూడా దర్శించుకున్నారు. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం శోభిత చేసిన ఫోటో షూట్ నెట్టింట రచ్చకు దారితీసింది. 

naga chaitanya:4/5

నాగార్జున:

శోభిత ధూళిపాళ తాజాగా.. సిగరెట్ నోటిలో పెట్టుకుని,మరో చేతిలో గన్ పట్టుకుని మరీ ఫోటో షూట్ చేశారు. అంతటితో ఆగకుండా.. దాన్ని తన ఇన్ స్టాలో కూడా పోస్ట్ చేశారు. దీంతో ఇది కాస్త రచ్చకు దారితీసింది.  నెటిజన్లు శోభిత పోస్ట్ పై మండిపడుతున్నాడు. అక్కడినేని కుటుంబం ఇజ్జత్ తీస్తున్నావనిమండిపడుతున్నారు.

sobhita controversy:5/5

శొభిత ధూళిపాల:

గతంలో సమంత కూడా ఇలాగే కాంట్రవర్సీగా ప్రవర్తించి.. చైతును ఇబ్బందుల్లో నెట్టిందని.. ఇప్పుడు నువ్వుకూడా... తయారయ్యావా అని.. శొభిత చేసిన పనికి నెటిజన్లు గట్టిగానే కౌంటర్ ఇస్తున్నారు. మొత్తంగా శోభిత ఒక చేతిలో సిగరెట్, మరోచేతిలో గన్ పట్టుకుని ఫోటో షూట్ చేయడం ప్రస్తుతం నెట్టింట దుమారంగా మారింది.