Add Zee Business As A Preferred Source
App

Nagarjuna: 66 ఏళ్ల వయసులో టబుతో మళ్ళీ రొమాన్స్ కి సిద్ధమైన నాగ్.. మహా ముదురువయ్యో!

Written ByVishnupriya
Published: Oct 10, 2025, 11:06 AM IST|Updated: Oct 10, 2025, 11:06 AM IST

Tabu: నాగార్జున ఇప్పుడు టబుతో మళ్ళీ రొమాన్స్ చేయడానికి సిద్ధమయ్యారు.. అంటూ ఒక వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ప్రస్తుతానికి నాగార్జునకి 66 సంవత్సరాలు. అయితే ఇప్పుడు మళ్లీ టబుతో రొమాన్స్ కి సిద్ధమయ్యారు అన్న విషయం అందరిని షాక్ కి గుడి చేస్తోంది..పూర్తి వివరాల్లోకి వెళితే..

Nagarjuna Romance With Tabu1/5

నాగార్జున టబుతో రొమాన్స్

టాలీవుడ్ అక్కినేని నాగార్జున తన కెరీర్ లో మరో మైలురాయికి.. చేరబోతున్నారు అదే తన వందవ సినిమా. ఈ సినిమాని ఇటీవల సైలెంట్ గా ప్రారంభించినట్లు తెలుస్తోంది.  తమిళ డైరెక్టర్ ఆర్ కార్తీక్ దర్శకత్వంలో నాగర్జున 100వ సినిమా రాబోతోంది. అయితే ఈ చిత్రంలో నాగార్జున ఎలా కనిపిస్తారు అనే విషయంపై అభిమానులు ఎక్సైటింగ్ గా ఎదురు చేస్తున్నారు.   

Nagarjuna Tabu2/5

నాగార్జున టబుతో రొమాన్స్

తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఈ చిత్రానికి లాటరీ కింగ్ అనే టైటిల్ ఉండబోతుందని,  ఇందులో నటీనటుల ఎంపిక విషయంలో కూడా సీనియర్ హీరోయిన్ టబు ని కీలకమైన పాత్రలో చూపించబోతున్నట్లు టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. 

Nagarjuna Personal Life3/5

నాగార్జున టబుతో రొమాన్స్

నాగార్జున, టబు జంటగా నటించిన నిన్నే పెళ్ళాడతా, ఆవిడ మా ఆవిడ వంటి సినిమాలు కూడా బ్లాక్ బస్టర్ విజయాలను అందుకున్నాయి. ఇప్పుడు మళ్లీ చాలాకాలం తర్వాత నాగార్జున వందవ సినిమాలో టబు నటిస్తోందని తెలిసి అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు. ఇందుకు సంబంధించి అధికారికంగా చిత్ర బృందం ప్రకటిస్తుందేమో చూడాలి.

Tabu Personal Life4/5

నాగార్జున టబుతో రొమాన్స్

ఇకపోతే ఒకవేళ ఇదే నిజమైతే నాగార్జున నువ్వు మహా ముదురువి.. టబుతో మళ్ళీ రొమాన్స్ చేయడానికి సిద్ధమయ్యావు అంటూ నెటిజన్స్ సరదాగా కామెంట్లు చేస్తున్నారు.  

Nagarjuna Tabu 5/5

నాగార్జున టబుతో రొమాన్స్

నిన్నే పెళ్లాడతా సినిమా సమయం నుండి వీరిద్దరి మధ్య ఎఫైర్ రూమర్స్ కొనసాగుతున్న వేళ.. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత కలిసి  నటించబోతున్నారని తెలిసి అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు..