Nagma: నగ్మా 90లలో అప్పటి కుర్రకారు కలల రాణి. హీరోయిన్‌గా తెలుగు, తమిళం, హిందీ సినీ ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేసింది. అప్పట్లో చిరంజీవి, బాలకృష్ణ, రజినీకాంత్, నాగార్జున, వెంకటేష్, బిగ్ బీ, అక్షయ్, సల్మాన్ వంటి స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది. తాజాగా ఈమె పిప్పల్ల బస్తాలా మారిన ఈమె షాకింగ్ లుక్‌ను చూసి నిజంగానే షాక్ అవాక్కవుతున్నారు.
1/7Nagma: నగ్మా 90s లో ఓ వెలుగు వెలిగింది. గ్లామర్ హీరోయిన్ గా.. అందాల ఆరబోతలో ఎలాంటి మొహమాటం లేకపోవడం ఈమెను మాస్ ఆడియన్స్ కు దగ్గర చేసింది. తెలుగులో బాలకృష్ణ, చిరంజీవి అటు వేరే భాషల్లో రజినీకాంత్, అమితాబ్, సల్మాన్, అక్షయ్, షారుఖ్ వంటి వేరే భాషల్లోని అగ్ర హీరోల సరసన నటించి మెప్పించింది.
2/7అంతేకాదు తెలుగు, తమిళ, హిందీ చిత్ర పరిశ్రమలో అగ్ర హీరోయిన్ గా సత్తా చాటింది. అంతేకాదు ముగ్గురు స్టార్ హీరోలు.. ఓ క్రికెటర్‌తో ఎఫైర్ తో వార్తల్లో వ్యక్తిగా నిలిచింది. ఇప్పటికీ ఒంటరిగానే జీవిస్తోంది. ఆ మధ్య కొన్ని సినిమాల్లో నటించింది. ఆ తర్వాత రాజకీయాల్లో ప్రవేశించి కాంగ్రెస్ పార్టీ తరుపున ఓ సారి మీరట్ లోక్ సభఎంపీగా పోటీ చేసింది.
3/7తాజాగా నగ్మా ఒళ్లు చేసిన ఫోటోలు చూసిన ఫ్యాన్స్ షాక్‌కు గురవుతున్నారు. అసలు ఒకప్పటి మా కలల కథానాయిక ఈమేనా అనే డౌట్స్ వ్యక్తం చేస్తున్నారు. రీసెంట్ గా నగ్మా బయట తిరుగుతున్న ఫోటోలును ఎవరో కెమెరాలో క్లిక్ అనిపించారు. అంతేకాదు దానికి సంబంధించిన ఫోటోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడం విశేషం. ఈ ఫోటోల్లో నగ్మా గుర్తు పట్టలేనంత లావుగా పిప్పల్ల బస్తాలా కనిపిస్తోంది.
4/7నగ్మా విషయానికొస్తే.. 90లలో స్టార్ కథానాయికగా ఓ రేంజ్ లో హవా నడిపించింది. ఈమె తెలుగులో సుమన్ కథానాయకుడిగా నటించిన పెద్దింటల్లుడు సినిమాతో తెరంగేట్రం చేసింది. ఆ తర్వాత చిరంజీవి, దర్శకేంద్రుడు కే.రాఘవేంద్ర రావు కాంబోలో తెరకెక్కిన 'ఘరానా మొగుడు' సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ అయింది.
5/7హీరోయిన్ గా టాప్ పొజిషన్ ను అందుకున్న నగ్మా వ్యక్తిగత జీవితం కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్ అనే చెప్పాలి. ఈమె ఆన్ స్క్రీన్ హీరోలతో రొమాన్స్ మాత్రమే కాదు.. బిహైండ్ స్క్రీన్ కూడా రొమాన్స్ చేసినట్టు అప్పట్లో కొన్ని పత్రికలు కథనాలు వండివార్చాయి కూడా
6/7నగ్మా.. 1974 హిందూ తండ్రికి ముస్లిమ్ అమ్మకు జన్మించింది. తండ్రి రాజస్థాన్ జైసల్మేర్ రాజకుటుంబానికి చెందిన వారు. ఆ తర్వాత వారి ఫ్యామిలీ గుజరాత్‌కు,ఆపై ముంబైకు షిఫ్ట్ అయింది. ఈమె చెల్లెల్లు జ్యోతిక, రోషిణి కూడా హీరోయిన్స్ గా అరంగేట్రం చేసారు. జ్యోతిక తమిళంలో అగ్ర కథానాయికగా సత్తా చాటింది. తోటి నటుడు సూర్యను పెళ్లి చేసుకుంది. నగ్మా టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, భోజ్‌పురి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్నారు.
7/7తమిళనాడులో నగ్మాకు అభిమానులు ఏకంగా గుడి కట్టేసారు. ఈమె వ్యక్తిగత జీవితం కూడా వివాదాలతో ముడిపడి ఉంది. ప్రస్తుతం ఒంటరి జీవితాన్నే గడుపుతోంది. మీడియా కథనాల ప్రకారం అప్పట్లో టీమ్ ఇండియా కెప్టెన్ సౌరవ్ గౌంగులి, అటు శరత్ కుమార్, భోజ్ పురి హీరోలు రవి కిషన్, మనోజ్ తివారీలతో నగ్మా ప్రేమాయణం అప్పట్లో మీడియాకు ఫుల్ మీల్స్ పెట్టిందనే చెప్పాలి. అప్పట్లో ఏ మ్యాగజైన్ చూసిన నగ్మా ప్రేమ వ్యవహారాల గురించే ఉండేది. నగ్మా లవ్ ఎఫైర్స్ నడిపిన వీళ్లందరు పెళ్లై పిల్లులున్నారు వారు కావడం గమనార్హం.