Add Zee Business As A Preferred Source
App

NBK in NSE: బాలకృష్ణ ఖాతాలో మరో అరుదైన రికార్డు.. దక్షిణాది చిత్ర పరిశ్రమ నుంచి ఒక్కమగాడు..

Written ByTA Kiran Kumar
Published: Sep 09, 2025, 12:00 AM IST|Updated: Sep 09, 2025, 12:00 AM IST

Nandamuri Balakrishna In NSE: నందమూరి బాలకృష్ణ 60 యేళ్ల పై పడిన వయసులో వరుస రికార్డులు బద్దలు కొడుతున్నాడు. ఒకదాని వెంట మరొక రికార్డులను తన ఖాతాలో వేసుకుంటున్నాడు. తాజాగా మరో రికార్డును బాలయ్య ఖాతాలో చేరింది. 

Balakrishna Ring the bell in NSE 1/5

స్టాక్ ఎక్సేంజ్ లో ఘంట వాయించిన బాలయ్య

Nandamuri Balakrishna In NSE: తెలుగు నటుడు నందమూరి బాలకృష్ణ ముంబై  నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (NSE) National Stock Exchangeలో చరిత్ర సృష్టించారు.  తాజాగా ఈయన బసవతారకం కేన్సర్ ఆసుపత్రి ప్రతినిధులతో కలిసి బాలయ్యలో  ముంబై నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (NSE) ను విజిట్ చేశారు. 

Balayya NSE 2/5

బాలయ్య NSE

బాలయ్య నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ ను విజట్ చేసిన సందర్బంగా నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ NSE అధికారులు ఆయన గౌరవార్థం స్టాక్ ఎక్స్చేంజ్‌లోని ఘంట మోగించే అవకాశం కల్పించారు.

Balakrishna National Stock Exchange 3/5

బాలకృష్న నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్

నేషనల్  స్టాక్ ఎక్స్చేంజ్ చరిత్రలో ఇంత వరకు దక్షిణాది నుంచి ఏ నటుడు కూడా అక్కడ ఘంట మోగించలేదు. ఒక సౌత్ నుంచి  అక్కడ ఘంట మోగించిన తొట్ట తొలి దక్షినాది  హీరోగా రికార్డు క్రియేట్ చేసాడు.  

Balakrishna MLA 4/5

బాలయ్య ప్రజా ప్రతినిధి

ఒక నటుడిగా.. ప్రజా ప్రతినిధిగా.. బసవ తారకం కాన్సర్ హాస్పిటల్ ఛైర్మన్ గా సినిమా, ప్రజా సేవా వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అంతేకాదు వరుసగా ఒకే నియోజకవర్గం నుంచి గెలిచి హాట్రిక్ సాధించిన నటుడిగా రికార్డు క్రియేట్ చేశారు. 

Balakrishna Records5/5

బాలయ్య రికార్డులు

బాలయ్య సినిమా, ప్రజా సేవలకు గుర్తించి కేంద్ర ప్రభుత్వం ఆయన్ని పద్మభూషణ్ తో  గౌరవించింది. 50 యేళ్ల సినీ కెరీర్ లో హీరోగా నటించిన ఏకైక హీరోగా వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో ఈయన పేరు చేరింది. తాజాగా నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ లో ఘంట మోగించిన తొలి దక్షిణాది నటుడిగా రికార్డుల మీద రికార్డులు 2025లో నమోదు చేయడం విశేషం.