Add Zee Business As A Preferred Source
App

Mokshagna: షాకింగ్‌ లుక్‌లో బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ! ఎలా ఉన్నాడో చూశారా?

Published: Apr 28, 2025, 09:17 PM IST|Updated: Apr 28, 2025, 09:17 PM IST

Nandamuri Balakrishna Son Mokshagna Shocking Looks: నందమూరి బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ మరోసారి కెమెరాలకు చిక్కాడు. హీరోగా ఎంట్రీ ఇస్తాడనుకున్న మోక్షజ్ఞ ఓ బహిరంగ కార్యక్రమంలో కనిపించారు. సినిమా కోసం కొన్నాళ్లకు కెమెరాలకు చిక్కకుండా ఉన్న మోక్షజ్ఞ చాలా రోజుల తర్వాత బాహ్య ప్రపంచానికి కనిపించాడు. మోక్షజ్ఞ ఎలా ఉన్నాడో చూద్దాం. అతడి సినిమా సింబా ఎంతవరకు వచ్చింది తదితర వివరాలు ఇలా ఉన్నాయి.

Mokshagna1/7

భారత ప్రభుత్వం ప్రకటించిన పద్మభూషణ్‌ అవార్డును న్యూఢిల్లీలో బాలకృష్ణ స్వీకరించారు. రాష్ట్రపతి భవన్‌లో జరిగిన కార్యక్రమంలో తన ఇద్దరు కుమార్తెలు, అల్లుళ్లు, మనవళ్లతో కలిసి హాజరైన బాలకృష్ణ వెంట అతడి కుమారుడు మోక్షజ్ఞ కూడా ఉన్నాడు.

Nandramuri Mokshagna New Looks2/7

రాష్ట్రపతి భవన్‌లో బాలకృష్ణ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతులమీదుగా పద్మ పురస్కారాన్ని పొందారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి భవన్‌లో కుటుంబంతో సహా బాలకృష్ణ ఫోజులు ఇచ్చారు. ఈ క్రమంలో అందరి దృష్టి అతడి కుమారుడు మోక్షజ్ఞపై పడింది. చాలా రోజుల తర్వాత కెమెరాలకు కనిపించడంతో అందరి దృష్టి మోక్షుపై పడింది.

Nandramuri Mokshagna News3/7

మోక్షు మళ్లీ బొద్దుగా అయినట్లు కనిపిస్తున్నాడు. సినిమా పోస్టర్‌లో కనిపించినట్టు మోక్షజ్ఞ ప్రస్తుతం అలా కనిపించడం లేదు. సింబా పోస్టర్‌లో మ్యాన్లీగా.. మంచి లుక్‌లో మోక్షజ్ఞ కనిపించాడు. కానీ ప్రస్తుతం అలాగా కనిపించకపోవడం చర్చనీయాంశంగా మారింది.

Nandramuri Mokshagna Simba Movie4/7

మోక్షు ప్రస్తుతం ప్రశాంత్‌ వర్మతో 'సింబా' అనే సినిమా చేస్తున్నాడు. ఆ సినిమాకు సంబంధించి పనులు పూర్తయినట్లు తెలుస్తోంది. అయితే ఆ సినిమా ఆగిపోయిందనే చర్చ జరుగుతోంది. ఈ సినిమాను మధ్యలోనే వదిలేసి ప్రశాంత్‌ వర్మ వేరే సినిమా చేస్తున్నట్టు పుకార్లు వస్తున్నాయి. ఎన్నో ఏళ్ల నుంచి బాలయ్య అభిమానులు ఎదురుచూస్తున్న వారి ఎదురుచూపులు ఇంకా ఫలించడం లేదు.

Mokshagna Simba Movie Updates5/7

నందమూరి వంశం నుంచి వస్తున్న మూడో తరం నటుడు మోక్షజ్ఞ. తన సినిమా ఎంట్రీ గురించి మోక్షజ్ఞ గతేడాది జూలైలో ప్రకటించాడు. ప్రకటించి ఏడాది అవుతున్నా ఆ సినిమా గురించి ఎలాంటి చర్చ జరగడం లేదు. చిత్రీకరణ ప్రారంభమైందని తెలుస్తున్నా కూడా ఎంతవరకు వచ్చిందనేది తెలియదు.

Mokshagna Simba6/7

ప్రస్తుతం మోక్షజ్ఞ వయసు 30 ఏళ్లు. ఇంత లేటు వయసులో హీరోగా ఎంట్రీ ఇస్తున్న హీరోగా మోక్షు ప్రత్యేకత సాధిస్తున్నాడు. బాలకృష్ణ తన కుమారుడిని హీరో చేయాలని ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తుండగా అతడి శరీరాకృతి హీరోకు తగ్గట్టు లేదు. దీంతో హీరోకు కావాల్సిన రూపురేఖలు మార్చుకుని.. గతంలో కంటే చాలా సన్నగా.. ఆకర్షణీయంగా మోక్షజ్ఞ తయారయ్యాడు. మళ్లీ ఇప్పుడు రూపం మారుతుండడంతో బాలకృష్ణ అభిమానులు ఆందోళన చెందుతున్నారు.

Mokshagna New Photo7/7

మోక్షు 'సింబా' సినిమా వాయిదా పడలేదని.. చిత్రీకరణ జరుగుతోందని బాలయ్య అభిమానులు చెబుతున్నారు. కొన్నాళ్లు ఆగిందని త్వరలోనే సినిమా పూర్తవుతుందని వివరణ ఇస్తున్నారు. 'సింబా' సినిమా వాయిదా అనేది పుకార్లుగా బాలయ్య ఫాన్స్‌తోపాటు టీడీపీ శ్రేణులు కొట్టి పారేస్తున్నారు. ఏది ఏమైనా మోక్షు రూపం మారకముందే సినిమాను పూర్తి చేస్తే మంచిది. లేకపోతే మళ్లీ సినిమా కోసం మరికొన్నాళ్లు ఆగాల్సి వస్తుందని మరికొందరు పేర్కొంటున్నారు.