Natural Hair Pack: తెల్ల జుట్టు సమస్య మిమ్మల్ని వెంటాడుతూ ఉంటే ఇప్పుడు చెప్పే చిన్ని చిట్కా పాటించి చూడండి. జుట్టుకి ఈ మాస్క్ వేసుకోవడం వల్ల తెల్లజుట్టు పూర్తిగా నల్లగా మారిపోతుంది. ఆ తరువాత కనీసం కెమికల్స్ తో కూడిన రంగు కూడా వేసే అవసరం రాదు. ఇంతకీ ఆ ప్యాక్ ఎలా చేసుకోవాలంటే..
1/5తెల్ల జుట్టు సమస్య చిన్నపిల్లలను కూడా ప్రస్తుతం ఎంతగానో సతమతం చేస్తోంది. చాలా చిన్నవయసులోనే వీళ్ళకి తెల్ల జుట్టు వచ్చేస్తుంది. ఇక కొంచెం వయసు పడిన వారికి చెప్పనవసరమే లేదు.. తెల్ల జుట్టు సమస్య అనేది పెద్ద కష్టంగానే మారుతుంది.
2/5అయితే తెల్ల జుట్టుని నల్లగా మార్చుకోవడానికి కెమికల్స్ తో కూడిన రంగు వేసుకుంటే.. అది కాస్త జుట్టు ఊడిపోయేలా చేస్తుంది. అలాంటప్పుడు ఇంట్లోనే చేసుకోగలిగే ప్యాక్ వేసుకోవడం ఉత్తమం.
3/5ఇప్పుడు చెప్పబోయే మాస్క్ జుట్టుకి వేసుకోవడం వల్ల తెల్ల జుట్టు పూర్తిగా నల్లగా మారుతుంది. ఈ మాస్క్ తయారీ కోసం ముందుగా.. ఒక స్పూన్ మెంతులను రాత్రంతా నీళ్లలో నానబెట్టుకోవాలి.
4/5మరసటి రోజు మెంతులు నానబెట్టిన నీళ్ళల్లో.. జీలకర్ర కూడా వేసి మరిగించాలి. అవి బాగా మరిగిన తర్వాత ఆ నీళ్లను.. వడకట్టి... ఏదైనా సీసాలో స్టోర్ చేసుకోవాలి.
5/5ఈ ప్యాక్ వారానికి ఒకసారి.. తల మొత్తం అప్లై చేసి అరగంట తర్వాత తలస్నానం చేయాలి. వారానికి ఒకసారి ఇలా చేయడం మంచిది. ఇలా ఒక ఆరు నెలలు చేయడం వల్ల తెల్ల జుట్టు పూర్తిగా నల్లగా.. మారుతుంది. ఆ పైన ఇంకా రంగు వేయాల్సిన అవసరం ఉండదు.