Add Zee Business As A Preferred Source
App

White Hairs Remedies: హెయిర్ డై అవసరమేలేదు.!. ఈ సింపుల్ టిప్స్‌ పాటిస్తే మీ తెల్లని వెంట్రుకలు బ్లాక్ బోర్డు కన్నా నల్లగా మారడం ఖాయం.!.

Written ByInamdar Paresh
Published: Sep 05, 2025, 12:00 PM IST|Updated: Sep 05, 2025, 12:04 PM IST

White hair reduce tips: చాలా మంది ఇటీవల తెల్లని వెంట్రుకల సమస్యలతో బాధపడుతున్నారు. దీంతో మార్కెట్ లోని ఏ డై కన్పిస్తే అది తమ తలవెంట్రుకలకు అప్లై చేస్తున్నారు. దీంతో వారి వెంట్రుకలు కాస్త ఊడిపోతున్నాయి. మొత్తంగా యువతీ,యువకులు వైట్ హెయిర్ సమస్యలతో తెగ బాధలు పడుతున్నారు.
 

Hari loss:1/6

లైఫ్ స్టైల్:

ఒకప్పుడు 35 ఏళ్లు దాటిన వారిలో తెల్లని వెంట్రుకలు కన్పించేవి.కానీ ప్రస్తుతం లైఫ్ స్టైల్ పూర్తిగా మారింది.  చిన్నపిల్లల వెంట్రుకలు సైతం తెల్లగా మారుతున్నాయి . మారిపోయిన జీవన శైలీ ఆహరం తీసుకునే విధనంలు మనిషి జీవనంపై చాలా చూపిస్తున్నాయి. ఈ క్రమంలో చాలా మంది తెల్లని వెంట్రుకల సమస్యలతో తెగ ఇబ్బందులు పడుతున్నారు.   

white hair:2/6

తెల్లని వెంట్రుకలు:

ఇటీవల ట్రాఫిక్లోని పొల్యుషన్ తో కూడా వెంట్రుకలు తెల్లగా మారిపోతున్నాయిన నిపుణులు చెబుతున్నారు. దీని వల్ల చిన్న వయసులోనే తమ వెంట్రుకల సమస్యలతో యువతీ,యువకుల తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు. అయితే.. చాలా మంది మార్కెట్ లో లభించే డైర్ లు ఉపయోగిస్తున్నారు . కానీ దీని వల్ల సైడ్ ఎఫెక్ట్ లు పుష్కలంగాఉంటాయని నిపుణులు చెబుతున్నారు. అందుకే నేచురల్ గా మన ఇళ్లలో లభించే కొన్ని పదార్థాలతో తెల్లని వెంట్రుకల్ని నల్లగా చేసుకోవచ్చు.  

White hair tips:3/6

లైఫ్ స్టైల్:

మందారం పువ్వుల్ని కోసి ఎండలో పెట్టాలి. పూర్తిగా పువ్వులు ఎండిపోయినతర్వాత కుప్పగా వాటిలో  కరివేపాకు, కుంకుడు కాయల పొట్టును వేయాలి. దీన్ని గ్రైండ్ చేయాలి. ఈ పొడిని నూనెలో మిక్స్ చేసి రోజు రాత్రిపూట తలకు పెట్టుకొవాలి. ఈ విధంగా ఒక నెల పాటు చేస్తు తెల్లని వెంట్రుకలు నల్లగా మారతాయి.  

white hair reduce tips:4/6

వైట్ హెయిర్ టిప్స్ :

అదే విధంగా గడ్డి చామంతి చాలా మంది ఇళ్లలో ఉంటుంది. ఈ మొక్క ఆకుల్ని ఎండలో ఆరబెట్టాలి. ఆ తర్వాతవీటినికూడా ఎండలో నాన బెట్టాలి. వీటితో పాటు ఉల్లిపాయల్ని కూడా తీసుకుని  గ్రైండర్ లో వేసి  దీనితో వచ్చిన పొడిని నూనెను గోరువెచ్చగా తీసుకుని దానిలో కల్పి రోజు రాత్రిపూట తలకు పట్టిస్తే తెల్లవెంట్రుకలు కుదుళ్ల నుంచి నల్లగా బ్లాక్ బోర్డు కన్న నిగ నిగలాడుతాయి.  

Life style:5/6

తెల్లని వెంట్రుకలు:

ముఖ్యంగా చాలా మంది ఒకటి రెండు తెల్లని వెంట్రుకలు ఉంటే వెంటనే వాటిని పీకి వేస్తారు. ఇలాంటి పనులు చేయడం వల్ల ఒక వెంట్రుక స్థానంలో రెండు నుంచి నాలుగు వెంట్రుకలు బైటకు వస్తాయి. అందుకే  తెల్లని వెంట్రుకల్నిఎట్టి పరిస్థితుల్లో కూడా పీకవద్దని నిపుణులు చెబుతారు.

white hair remedies:6/6

వైట్ హెయిర్:

మరోవైపు డైలు వాడటం కూడా చాలా ప్రమాదం ఉంటుంది, వెంట్రుకలు మొత్తంగా దీని వల్ల తెల్లగా మారిపోతాయని చెబుతారు.   అంతేకాకుండా.. తలనొప్పి, తలతిప్పడం వంటి సమస్యలు దీని వల్ల యేర్పడతాయని నిపుణులు చెబుతుంటారు. అందుకే డైలు పెట్టడం మానేసి.. సింపుల్ రెమిడీలు నేచురల్ పద్దతిలో పాటించాలని చెబుతున్నారు. ( ఇది సోషల్ మీడియా వైరల్ ఆధారంగా రాయబడింది. జీ తెలుగు దీనికి బాధ్యత వహించదు..)