Navodaya 2025 Results: ‘నవోదయ’ ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల.. ఈ డైరెక్ట్‌ లింక్‌తో ఫలితాలు తెలుసుకోండి..

Jawahar Navodaya Samiti Results 2025: జవహర్‌ నవోదయ సమితి దేశవ్యాప్తంగా జనవరి 18న పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన ఫలితాలను నేడు విడుదల చేసింది.నేరుగా Navodaya.gov.in నవోదయ అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా తెలుసుకోవచ్చు.
 

1 /5

Jawahar Navodaya Samiti Results 2025: జవహర్‌ నవోదయం 6వ, 9వ తరగతికి సంబంధించిన ప్రవేశ పరీక్ష ఫలితాలను విడుదల చేసింది. జవహర్‌ నవోదయ సమితి (JNS) అధికారికంగా ఈ ఫలితాలను విడుదల చేసింది. పరీక్ష ఫలితాలు తెలుసుకోవడానికి నేరుగా Navodaya.gov.in నవోదయ అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా తెలుసుకోవచ్చు.  

2 /5

నవోదయం ప్రవేశ పరీక్ష ఫలితాలు తెలుసుకునే విధానం.. దేశవ్యాప్తంగా జనవరి 18వ తేదీని 6, 9 తరగతి ప్రవేశ పరీక్ష జవహర్‌ నవోదయ సమితి పరీక్ష నిర్వహించింది. ఈ డైరెక్ట్‌ లింక్‌తో ఫలితాలు తెలుసుకోండి.

3 /5

మొదట జవహర్‌ నవోదయం అధికారిక వెబ్‌సైట్‌ Navodaya.gov.in ఓపెన్‌ చేయండి. అక్కడ మీరు 'Result' సెక్షన్‌ పై క్లిక్‌ చేయండి. క్లాస్‌ 6 లేదా క్లాస్‌ 9 జేఎన్‌వీఎస్‌ రిజల్ట్‌ 2025పై క్లిక్‌ చేయాలి. ఇప్పుడు మీ క్రమ సంఖ్య, పుట్టిత తేదీ ఎంటర్‌ చేయాలి.  చివరగా వివరాలను సబ్మిట్‌ చేస్తే మీ ముందు ఫలితాలు కనిపిస్తాయి.  ఆ స్కోర్‌ కార్డును మీరు డౌన్‌లోడ్ చేసి పెట్టుకోండి. 

4 /5

అడ్మిషన్‌ విధానం ఇదే.. జవహర్‌ నవోదయ సమితి జాతీయ స్థాయిలో అడ్మిషన్ల స్వీకరణ చేపడుతుంది. దీనికి సంబంధించి ప్రవేశ పరీక్షలు కూడా అన్ని రాష్ట్రాల్లో నిర్వహిస్తుంది. జవహర్ నవోదయ సమితి కేంద్ర ప్రభుత్వం, విద్య మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నడిచే రెసిడెన్షియల్‌ స్కూళ్లు. ఈ స్కూళ్లకు అడ్మిషన్లు రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు.

5 /5

 అయితే, ఈ పరీక్షలో పాసైన విద్యార్థులు అడ్మిషన్‌ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌ ఉంటుంది.  దీని విధివిధానాలు అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపరిచారు. వాటిని క్షుణ్నంగా చదవాలి. ఏవైనా సందేహాలు ఉంటే మీ దగ్గరలో ఉన్న జవహర్‌ నవోదయ సమితి హెల్ప్‌లైన్‌ నంబర్‌ లేదా కేంద్రాలకు వెళ్లి వివరాలు తెలుసుకోవచ్చు.