Nayanthara: బుద్ది గడ్డితిని విఘ్నేష్‌ను పెళ్లి చేసుకున్న ..?.. భర్త గురించి షాకింగ్ వ్యాఖ్యలు చేసిన నయనతార..!.. ఏంజరిగిందంటే..?
నయన తార ఇటీవల ఎక్కువగా వివాదస్పద అంశాలతో వార్తలలో ఉంటున్నారు. ధనుష్ కు, నయన తారకు మధ్య గొడవలు పీక్స్ కు చేరాయని చెప్పుకొవచ్చు. ఇటీవల మద్రాస్ హైకోర్టు సైతం.. నయన తారకు ఈ వివాదంలో కౌంటర్ దాఖలు చేయాలని నోటీసులు ఇచ్చింది.
ఈ నేపథ్యంలో ప్రస్తుతం వీరి మధ్య గొడవలతో ఇండస్ట్రీలో రకరకాల పుకార్లు వార్తలలో ఉంటున్నాయి. అయితే.. తాజాగా, నయన తార తన భర్త విషయంలో చేసిన వ్యాఖ్యలు నెట్టింట తెగ వైరల్ గా మారుతున్నాయి.
నయన తార ఇటీవల ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. విఘ్నేష్ శివన్ ను తొలిసారిగా తాను ప్రపోజ్ చేసినట్లు చెప్పుకొచ్చారు. నానుమ్ రౌడీధాన్ మూవీ సమయంలో.. 2015 నుంచి వీరి మధ్య డేటింగ్ స్టార్ట్ అయ్యిందంట. దాదాపు.. ఏడేళ్ల పాటు వీరిద్దరు కూడా లవ్ చేసుకున్నట్లు తెలుస్తొంది.
అదే విధంగా.. 2022 లో వీరిద్దరు పెళ్లి బంధంతో ఒక్కటయ్యారంట. ఈ క్రమంలో నయన్ ఇటీవల ధనుష్ తో.. నయనతార బియాండ్ ది ఫెయిరీటెల్.. నుంచి.. నానుమ్ డాక్యూమెంటరీలొని కొన్నిసెకన్లను.. ఉపయోగించుకున్నట్లు తెలుస్తొంది.
దీంతో ధనుష్ 10 కోట్లివ్వాలని లీగల్ నోటీసులు పంపడంతో పాటు, హైకోర్టులో పిటిషన్ సైతం దాఖలు చేసిన విషయం తెలిసిందే. అయితే... ఈ వివాదంలోకి నయన్ ను మాత్రమే కాకుండా.. విగ్నేష్ శివన్ ను సైతం ఇటీవల కొంత మంది నెటిజన్లు ట్రోల్స్ చేసినట్లు తెలుస్తొంది. అదే విధంగా ఆయన ఇటీవల తీసిన ఒక సినిమా విషయంలో కూడా డైరెక్టర్ల మీటింగ్ లో విఘ్నేష్ ను లోకువగా మాట్లాడారంట.
దీంతో మనస్తాపానికి గురైన విఘ్నేష్ శివన్ తన ఇన్ స్టా అకౌంట్ ను డెలీట్ చేసిన విషయం తెలిసిందే.. తన గొడవల వల్లే.. విఘ్నేష్ శివన్ కూడా ఇబ్బందులు పడుతున్నాడని... నయన్ బాధపడ్డారంట. విఘ్నేష్ ఎంతో టాలెంట్ ఉన్న వ్యక్తి అని అన్నారు.
అందరు తన కన్న టాలెంట్, ఫైనాన్షియల్ గా సెటిల్ అయిన వాళ్లను చేసుకుంటారని. . తాను మాత్రం.. విఘ్నేష్ లో ఉన్న కష్టపడే తత్వను చూసి ప్రేమించి, పెళ్లి చేసుకున్నట్లు చెప్పారు. ఈ క్రమంలో ప్రస్తుతం విఘ్నేష్ శివన్ కు అవకాశాలు రావడం చాలా తక్కువైందని కూడా వార్తలు వస్తున్నాయి.
విఘ్నేశ్ శివన్.. 17 ఏళ్లకే కెరియర్ ప్రారంభించాడని నయన్ అన్నారు. ఈ గొడవల వల్ల మా ఫ్యామిలీ డిస్టర్బ్ అవుతుందని నయన్ ఎమోషనల్ అయినట్లు తెలుస్తొంది. ఈ జంటకు...వీరికి ఉయిర్, ఉలగం కవల పిల్లలున్న విషయం తెలిసిందే.