Add Zee Business As A Preferred Source
App

Nayanthara: మీకు ఎప్పుడూ ఋణపడి ఉంటానంటూ నయనతార ఎమోషనల్ పోస్ట్.. నెట్టింట వైరల్..!

Written ByAruna Maharaju
Published: Oct 09, 2025, 03:52 PM IST|Updated: Oct 09, 2025, 04:19 PM IST

Nayanthara 22 years of journey: నయనతార.. ఈ అందాల తార గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. చంద్రముఖి సినిమాతో టాలీవుడ్‌ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు.. ఆ తరువాత బ్యాక్ టూ బ్యాక్ సూపర్ హిట్ సినిమాల్లో నటించే అవకాశాన్ని దక్కించుకుంది. అయితే నయనతార తాజాగా సోషల్ మీడియాలో ఓ ఎమోషనల్ పోస్ట్ షేర్ చేయగా.. అది ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది.  
 

Nayanthara 22 years of journey1/5

లేడీ సూపర్ స్టార్ నయనతార

లేడీ సూపర్ స్టార్ నయనతార.. తాజాగా సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. అదేంటంటే నయనతార.. సినీ ఇండస్ట్రీకి వచ్చి 22 ఏళ్లు పూర్తయింది. ఈ సందర్బంగా తన ప్రయాణాన్ని గుర్తుచేసుకొని ఎమోషనల్ అయింది నయన్. 

Nayanthara2/5

నయనతార

మొదటిసారి కెమెరా ముందు వచ్చి నేటికి 22 ఏళ్లు. సినిమాలే నా ప్రపంచం అవుతాయని ఎప్పుడు అనుకోలేదు. తెలియకుండానే ఇండస్ట్రీలోకి వచ్చాను. ప్రతి షాట్‌, ప్రతి ఫ్రేమ్‌, ప్రతి నిశ్శబ్దం నన్ను మార్చేశాయి, ధైర్యాన్నిచ్చాయి. నన్ను నన్నుగా మార్చాయి. 

Actress Nayanthara3/5

నయనతార ఎమోషనల్ పోస్ట్

నా ఈ ప్రయాణంలో తోడుగా ఉన్న ప్రతి ఒక్కరికి రుణపడి ఉంటానంటూ పోస్ట్ రిలీజ్ చేసింది. దీంతో నయనతార షేర్ చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Actress Nayanthara4/5

నయనతార

ఇక ఈ పోస్ట్ చూసిన సినీ సెలబ్రిటీలు, నెటిజన్లు, ఫ్యాన్స్.. నయనతారకు కంగ్రాట్స్ తెలియజేస్తూ కామెంట్స్ పెడుతున్నారు.   

Heroine Nayanthara5/5

నయనతార హీరోయిన్

ఇక నయనతార ప్రస్తుతం తెలుగులో మెగాస్టార్ చిరంజీవితో ఓ సినిమా చేస్తోంది. మన శంకర వరప్రసాద్ గారు అనే టైటిల్ తో వస్తున్న ఈ సినిమాను దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్నాడు.