Add Zee Business As A Preferred Source
App

Nayanthara-Trisha rivalry: త్రిష తో నయనతార శత్రుత్వం.. ఆమెతో మాట్లాడేది లేదు అంటూ క్లారిటీ..!

Written ByVishnupriya
Published: Mar 31, 2025, 08:38 AM IST|Updated: Mar 31, 2025, 08:38 AM IST

Nayanthara Trisha fight: నయనతార, త్రిష మధ్య శత్రుత్వం ఉంది అని కోలీవుడ్ మీడియాలో ఒకప్పుడు తెగ వైరల్ చేశాయి. ఇక అందుకు తగ్గట్టుగానే ఆ తర్వాత నయనతార, త్రిష ఇచ్చిన ఇంటర్వ్యూలు కూడా అప్పట్లో దుమారం రేపాయి. ఈ క్రమంలో ఒకప్పుడు నయనతార త్రిష గురించి ఏమనింది అన్న విషయాన్ని చూద్దాం..
 

Nayanthara about Trisha1/5

నయనతార , త్రిష

తమిళ సినీ పరిశ్రమలో హీరోల మధ్య పోటీ సాధారణమే అయినా, హీరోయిన్ల మధ్య కూడా పోటీ ఉందన్న వార్తలు ఎప్పుడూ వినిపిస్తూనే ఉంటాయి. మునుపటి కాలంలో సిమ్రన్ - జ్యోతిక, తాజాగా త్రిష - నయనతారల మధ్య పోటీ వల్లే గొడవలు కూడా వచ్చాయి అనే వార్త వైరల్ అవుతుంది. అయితే ఈ విషయంపై నయనతార స్వయంగా ఓ ఇంటర్వ్యూలో స్పష్టతనిచ్చారు.  

Nayanthara about Namita2/5

నయనతార , త్రిష

ఒకప్పుడు నయనతార  మీడియామాధ్యమాల గురించి మాట్లాడుతూ, తాను ఎక్కువగా ఇంటర్వ్యూలు ఇవ్వకపోవడం వల్లే మీడియా తన గురించి విభిన్న కథనాలు రాస్తుందని పేర్కొన్నారు. “నేను అర్థం లేని విషయాలకు స్పందించను. ఒక సినిమా విడుదల కానున్నప్పుడు, లేదా ఎవరైనా నా గురించి తప్పుడు ఆరోపణలు చేస్తే తప్ప, నేను మీడియాతో మాట్లాడను” అని నయనతార వివరించారు.    

Nayanthara latest interview3/5

నయనతార , త్రిష

త్రిషతో తన అనుబంధం గురించి ప్రశ్నించగా, “మేం మంచి స్నేహితులు కాదనే చెప్పగలను. స్నేహితురాలు అనే పదం చాలా గొప్పది. అందుకే నేను మేము స్నేహితులు అనే అబద్ధం చెప్పను. నేను పెద్ద మాట్లాడుకోము అయితే నిజానికి మాకు ఏం విభేదాలూ లేవు. అలా అని ఉన్న సమస్యలను వెళ్లిన తర్వాత పరిష్కరించాలి అనుకోవడం లేదు. తనతో మాట్లాడాలని నేను అనుకోవడం లేదు” అని ఆమె సమాధానం ఇచ్చారు.  

heroines rivalry4/5

నయనతార , త్రిష

నయనతార, తమ బిల్లా చిత్ర సహనటి నమితతో కూడా సంబంధాల గురించి మాట్లాడారు. “చిత్రీకరణ ప్రారంభంలో మేం స్నేహంగా ఉండేవాళ్లం. కానీ, అనూహ్యంగా ఒకరోజు నుంచి ఆమె నన్ను పూర్తిగా పక్కన పెట్టింది. మిగతా అందరితో మాట్లాడినా, నన్ను పూర్తిగా తప్పించుకుంది. దీనికి స్పష్టమైన కారణం నాకు తెలియదు. అది తన సమస్య, నా సమస్య కాదు” అని ఆమె స్పష్టం చేశారు.  

 Trisha Nayanthara competition5/5

నయనతార , త్రిష

త్రిషతో తనకు విభేదాలు ఉన్నాయా? అనే ప్రశ్నకు నయనతార స్పష్టమైన సమాధానం ఇచ్చారు. “మీడియా మన మధ్య పోటీ ఉందని చెప్పుకోవడానికి ఇష్టపడుతుంది. కానీ నిజానికి మా మధ్య అంత పెద్ద సమస్య ఏదీ లేదు. పోటీ అనేది పరిశ్రమలో సహజమే. కానీ అది వ్యక్తిగతంగా తీసుకోవాల్సిన అవసరం లేదు” అని వివరించారు.  చివరగా, తనపై వ్యతిరేక అభిప్రాయాలు ఉన్న వారిపై ఏమనుకుంటున్నారనేది ప్రశ్నించగా, నయనతార సరళంగా “ఒకరు నన్ను ఇష్టపడకపోతే, నేనూ వారిని ఇష్టపడను. అంతే” అని తేల్చేశారు.