Urvashi Rautela: కొంత మంది హీరోయిన్స్ తమ నటన కన్నా.. అంద చందాలతోనే పేరు తెచ్చుకుంటారు. అలాంటి వాళ్లలో ఊర్వశి రౌతెలా ఒకరు. అచ్చం ఊర్వశి ఇలా ఉంటుందేమో అనే రీతిలో ఈమె తన గ్లామర్ తో ఆడియన్స్ ను అట్రాక్ట్ చేస్తోంది. తెలుగులో చిరంజీవి 'వాల్తేరు వీరయ్య'తో ఎంట్రీ ఇచ్చిన ఈ భామ.. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ తో ‘బ్రో’.. ఈ యేడాది ‘డాకు మహారాజ్’ మూవీలో దబ్బిడి దిబ్బిడి అంటూ సందడి చేసింది.
ఊర్వశి రౌతెలా బాలీవుడ్ లో యాక్షన్ స్టార్ సన్ని దేవోల్ కథానాయికగా యాక్ట్ చేసిన 'సింగ్ సాబ్ ది గ్రేట్' చిత్రంతో కథానాయికగా ఇంట్రడ్యూస్ అయింది.
ప్రస్తుతం తెలుగులో ఊర్వశి ఐటెం పాటలకు కేరాఫ్ అడ్రస్ గా మారింది. అంతేకాదు బడా హీరోల సరసన ప్రత్యేక గీతాల్లో అలరిస్తోంది. అంతేకాదు ఈ పాటలతో ఇక్కడ తన కంటూ ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఏర్పరచుకుంది.
2015 జరిగిన అందాల పోటీల్లో మిస్ దివా.. మిస్ యూనివర్స్ ఇండియా కిరీటాన్ని కైవసం చేసుకుంది ఊర్వశి రౌతెల. ఆ తర్వాత ఊర్వశికి వరుసగా సినిమా అవకాశాలు వస్తూనే ఉన్నాయి.
15 ఏళ్ల వయసులోనే మోడల్‌గా కెరీర్ స్టార్ట్ చేసిన ఊర్వ0శి.. ఆ తర్వాత 2009లో మిస్ ఇండియా టీన్ టైటిల్ విన్నర్ గా నిలిచింది.
ముఖ్యంగా హిందీలో 'సనమ్ రే, ' ది గ్రేట్ గ్రాండ్ మస్తీ', హేట్ స్టోరీ 4, పాగల్ పంతి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. 2014లో 'మిస్టర్ ఐరావత' సినిమాతో కన్నడ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది.
2022లో 'లెజెండ్ శరవణన్' హీరోగా నటించిన 'ది లెజెండ్' మూవీతో తమిళ సినీ ఇండస్ట్రీలో లెగ్ పెట్టింది. ఇక చిరంజీవి హీరోగా నటించిన 'వాల్తేరు వీరయ్య'తో తెలుగులో ఐటెం భామగా లెగ్ పెట్టింది. ఆ తర్వాత స్కంధ, బ్రో, ఏజెంట్, తాజాగా డాకు మహారాజ్ సినిమాల్లో ఐటెం పాటల్లో మెరిచింది.
ఊర్వశి రౌతెలా 1994 ఫిబ్రవరి 25న హరిద్వార్‌లో జన్మించింది. తల్లి మీరా రౌతెలా, తండ్రి మన్వర్ సింగ్ రౌతెలా ఈమెది గర్వాలీ రాజ్‌పుత్ ఫ్యామిలీ. అంతేకాదు 15వ ఏటనే లైఫ్ టైమ్ ఫ్యాషన్ లీక్ తర్వాత ఈమె వెనుదిరిగి చూసుకోలేదు. 2011లో ఇండియన్ ప్రిన్సెస్ .. మిస్ ఏషియన్ సూపర్ మోడల్ 2011 టైటిల్స్‌ను గెలుచుకుంది. 2014లో యోయో హనీ సింగ్‌తో చేసిన లవ్ డోస్ ప్రైవేట్ ఆల్బమ్ ఊర్వశికి మంచి పేరు తీసుకొచ్చింది.