Niharika: అల్లు అర్జున్ తో లవ్ స్టోరీ.. అసలు విషయం బయట పెట్టిన మెగా డాటర్..

Mega Daughter About Allu Arjun: అల్లు అర్జున్ తో ప్రేమ కథ చిత్రాన్ని తీయాలని.. సూపర్ స్టార్ మహేష్ బాబు తో మైథాలజికల్ సినిమాని తీయాలని  కోరికగా ఉందని తెలియజేసింది నిహారిక.

1 /5

మెగా డాటర్ నిహారిక ఒకవైపు సినిమాలకు నిర్మాతగా ఉంటూనే.. మరొకవైపు పలు చిత్రాలలో హీరోయిన్గా కూడా నటిస్తూ బిజీగా ఉన్నది. వివాహమయి విడాకుల తర్వాత ఎక్కువగా సినీ లైఫ్ మీదే ఫోకస్ పెట్టింది నిహారిక. అలా కమిటీ కుర్రాళ్ళు సినిమాతో నిర్మాతగా మారి మంచి విజయాన్ని అలాగే ఈ చిత్రానికి వర్సటైల్ ప్రొడ్యూసర్ ఆఫ్ ది ఇయర్ అనే అవార్డును కూడా నిహారిక అందుకున్నది. 

2 /5

అయితే ఇలాంటి సమయంలో టాలీవుడ్ లో కొంతమంది హీరోల పైన నిహారిక చేసిన కొన్ని కామెంట్స్ అభిమానులకు ఆనందాన్ని కలిగించేలా ఉన్నాయి. వాటి గురించి చూద్దాం.  ముఖ్యంగా నిర్మాతగా మారడంతో నిహారిక కొంత మంది హీరోలతో ఇలాంటి చిత్రాలు తీయాలని, డ్రీం తనకు ఉందని తెలిపింది.

3 /5

మొదట అల్లు అర్జున్ తో ప్రేమ కథ చిత్రాన్ని తీయాలని.. అలాగే సూపర్ స్టార్ మహేష్ బాబు తో మైథాలజికల్ సినిమాని తీయాలని, ఇక పాన్ ఇండియా హీరో ప్రభాస్ తో కామెడీ సినిమా తీయాలని కోరికగా ఉందని తెలియజేసింది. ఒకవేళ  తనకు డైరెక్షన్లో అవకాశం వస్తే మొదటి సినిమాని రామ్ చరణ్ తో  తీస్తానంటూ తెలియజేసింది. 

4 /5

ఇటీవల అవార్డు వేడుకలలో టాలీవుడ్ హీరోల గురించి ప్రశ్నిస్తూ ఎవరితో ఎలాంటి జానర్లో సినిమా చేయాలనుకుంటున్నారు అని ప్రశ్నించగా నిహారిక ఇలా స్పందించింది. ఎక్కువ మేకప్ వేసుకోవద్దని, తనలోని యాంకర్ కి నిన్ను నువ్వు నమ్ముకో అని, తనలోని నిర్మాతకు మంచి స్క్రిప్ట్ లు ఎంపిక చేసుకోమని తనలోని ఒక నటికి తానే సలహా ఇచ్చుకున్నాను అని తెలిపింది నిహారిక. 

5 /5

ఇకపోతే హీరోయిన్ గా ప్రూవ్ చేసుకో లేకపోయినా ఈమె హోస్టుగా సక్సెస్ అయ్యింది ఇక క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా పలు చిత్రాలలో నటించి మెప్పించిన నిహారిక కమిటీ కుర్రోళ్ళు సినిమాతో నిర్మాతగా కూడా సక్సెస్ అందుకుంది.. ఈ చిత్రానికి గాను ప్రొడ్యూసర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు కూడా అందుకుంది. ఇక ప్రస్తుతం సంగీత శోభన్ హీరోగా , ఒక సినిమా నిర్మిస్తున్న నిహారిక దానికి మానస శర్మ దర్శకురాలిగా వ్యవహరిస్తున్నారు.