Add Zee Business As A Preferred Source
App

Niharika Konidela: మళ్లీ తుంటరి పని చేసిన కొణిదెల నిహారిక.. వార్నింగ్ ఇచ్చిన తల్లి

Published: Sep 04, 2025, 07:20 PM IST|Updated: Sep 04, 2025, 07:27 PM IST

Niharika Konidela Dangerous Stunt: మెగా ఇంటి గారాలపట్టీ నిహారిక జీవితాన్ని ఎంజాయ్‌ చేస్తోంది. తన జీవితంలో జరిగిన చేదు పరిణామాలను మరచిపోయి హాయిగా జీవిస్తున్న క్రమంలో ఆమె తల్లి తిట్టేసింది. ఈ సందర్భంగా తల్లికి క్షమాపణలు చెప్పేసింది. ఇంతకీ ఏం జరిగిందో తెలుసుకుందాం.

1/6

చలాకీగా.. గలగల మాట్లాడుతూ కొణిదెల నిహారిక సందడి చేస్తుంటుంది. అందరూ అల్లరి పిల్లగా పిలుచుకునే నిహారిక ప్రస్తుతం జీవితాన్ని ఎంజాయ్‌ చేస్తోంది. తన వ్యాపారం.. సినిమలతో బిజీగా ఉంటూనే ట్రిప్పులు వేస్తోంది. ఈ క్రమంలోనే ఓ ప్రమాదకర స్టంట్‌ చేయగా.. ఆమె తల్లి తిట్టిందని తెలుస్తోంది. 

2/6

సినిమాలతో బిజీగా ఉన్న సమయంలో కొంత ఖాళీ దొరకడంతో ఇటీవల భారీ ట్రిప్పుకు నిహారిక వెళ్లింది. తన స్నేహితులతో కలిసి ఆ ట్రిప్పుకు వెళ్లగా కొన్ని ఫొటోలు, వీడియోలు పంచుకుంది. ట్రిప్పులో భాగంగా ఓ ప్రమాదకర స్టంట్‌ నిహారిక చేసింది.

3/6

ట్రిప్పులో భాగంగా ఓ జలపాతాన్ని నిహారిక సందర్శించింది. అంతెత్తు నుంచి దూకి వస్తున్న నీటిని ఎంతో ఆస్వాదించింది. చుట్టూ కొండలు మధ్యలో జలపాతం ధారళంగా వస్తుండగా నిహారిక దానికి చేరువగా వెళ్లింది. దానికి సంబంధించిన వీడియోను నిహారిక తన సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది.

4/6

ఆ వీడియోలో తన తల్లి విషయమై నిహారిక చెప్పింది. 'నేను క్షేమంగా ఇంటికి రావాలని మా అమ్మ నాకోసం ప్రార్థిస్తూ ఉంటుంది. కానీ నేను ఇలా ఎంజాయ్‌ చేస్తున్నా. క్షమించు అమ్మ' అని తన ఇన్‌స్టాగ్రామ్‌లో నిహారిక పోస్టు చేసింది.

5/6

ఆ వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఈ పోస్ట్‌కు నిహారిక వదిన, వరుణ్‌ తేజ్‌ భార్య లావణ్య త్రిపాఠి స్పందించింది. నవ్వుతున్న ఎమోజీని కామెంట్‌ చేయగా.. సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు మహాతల్లి, అనిల్‌ గీల తదితరులు లైక్‌ చేశారు.

6/6

సినీ పరిశ్రమలో నటిగా.. నిర్మాతగా మెగా డాటర్ నిహారిక కొణిదెల విజయాలు అందుకుంటోంది. గతేడాది కమిటీ కుర్రాళ్లతో భారీ విజయాన్ని అందుకోగా.. అవార్డులు కూడా పొందిన విషయం తెలిసిందే. ప్రస్తుతం కొన్ని ప్రాజెక్టులతో నిహారిక బిజీగా ఉంది.