Add Zee Business As A Preferred Source
App

Niharika konidela: ఫ్యామిలీతో కలిసుండటం లేదంటూ నిహారిక కొణిదెల షాకింగ్ కామెంట్స్.. ఎందుకో తెలుసా..?

Written ByAruna Maharaju
Published: Sep 29, 2025, 10:58 PM IST|Updated: Sep 29, 2025, 11:15 PM IST

Niharika: మెగా డాటర్ నిహారిక కొణిదెల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన చలాకీతనంతో ఎప్పుడూ నవ్వుతూ.. అందరినీ నవ్విస్తూ ఉంటుంది. ‘ఒక మనసు’ సినిమాతో వెండితెరపై అడుగు పెట్టిన నిహారిక.. హీరోయిన్‌గా పెద్ద సక్సెస్ సాధించకపోయినా, నిర్మాతగా తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. తాజాగా తన కుటుంబంతో కలిసి ఉండట్లేదని.. సెపరేట్‌గా ఒక్కదాన్నే వేరే ఇంట్లో ఉంటున్నానని చెప్పి నిహారిక అందరికీ షాక్ ఇచ్చింది. 
 

Niharika Konidela Latest Comments1/8

మెగా డాటర్ నిహారిక

నిహారిక కొణిదెల.. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ తన ఫ్యాన్స్‌తో టచ్‌లో ఉంటుంది. అయితే ఓ ఇంటర్వ్యూలో తన పర్సనల్ లైఫ్, ఫ్యామిలీ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పుకొచ్చింది నిహారిక.   

Niharika Konidela2/8

మెగా డాటర్ నిహారిక షాకింగ్ కామెంట్స్

ప్రజెంట్ తను ఫ్యామిలీతో కాకుండా విడిగా ఉంటున్నానని చెప్పింది నిహారిక. అయితే తాను సెపరేట్‌గా ఉంటున్నప్పటికీ.. తన కుటుంబానికి దూరం కాలేదని తెలిపింది. రెండు రోజులకోసారి ఇంటికి వెళ్లి కుటుంబసభ్యుల్ని కలుస్తూనే ఉంటానంది. 

Niharika Konidela Latest Comments3/8

మెగా డాటర్ నిహారిక షాకింగ్ కామెంట్స్

తన అన్నయ్య వరుణ్‌ తేజ్‌కి కొడుకు పుట్టడంతో తనకు అత్తగా ప్రమోషన్ వచ్చిందని.. ఇప్పుడు ఫుల్ బిజీగా ఉన్నానని నిహారిక చెప్పింది. తన మేనల్లుడిని ఎత్తుకుంటే తనకు ఇంట్లో పనులు చెప్పడం లేదని.. అంతకముందైతే అది తీసుకురా.. ఇది తీసుకురా అని పనులు చెప్పేవారని.. ఇప్పుడు ఎవరూ ఏమి అనడం లేదంది నిహారిక.  

Mega Daughter Niharika Konidela4/8

నిహారిక షాకింగ్ కామెంట్స్

తన మేనల్లుడు పెద్దయ్యాక సినిమాలపై ఆసక్తి ఉంటే హీరోగా ఇంట్రడ్యూస్ చేస్తూ తన బ్యానర్‌లో తానే  సినిమా నిర్మిస్తానని చెప్పుకొచ్చింది నిహారిక.  

Niharika Konidela5/8

మెగా డాటర్ నిహారిక షాకింగ్ కామెంట్స్

నటిగా తాను అనుకున్న స్థాయికి చేరుకోలేకపోయినా నిర్మాతగా మాత్రం నిహారిక సత్తా చాటింది. తన పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్‌పై ముద్దపప్పు అవకాయ్, నాన్న కూచీ, మ్యాడ్ హౌస్, ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ, హలో వరల్డ్ వంటి వెబ్ సిరీస్‌లను రూపొందించి మంచి పేరు తెచ్చుకుంది నిహారిక.  

Niharika Konidela6/8

మెగా డాటర్ నిహారిక కొణిదెల

గతేడాది విడుదలైన ‘కమిటీ కుర్రోళ్లు’ సినిమాతో బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు రాబట్టి గద్దర్ అవార్డును కూడా సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఆమె సంగీత్ శోభన్ హీరోగా మానస శర్మ దర్శకత్వంలో మరో సినిమాను నిర్మిస్తోంది.

Mega Daughter Niharika Konidela7/8

నిహారిక కొణిదెల

ప్రస్తుతం నిహారిక చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అభిమానులు, నెటిజన్లు ఆమె ధైర్యాన్ని మెచ్చుకుంటున్నారు.   

Niharika Konidela8/8

మెగా డాటర్ నిహారిక కొణిదెల

వ్యక్తిగత జీవితంలో ఎదురైన కఠిన పరిస్థితుల మధ్య కూడా.. కెరీర్‌లో తనదైన పంథాని సృష్టించుకోవడం నిహారిక ధైర్యానికి నిదర్శనమని కొనియాడుతున్నారు.