Niharika konidela controversy: మెగా డాటర్ నిహారిక వ్యవహారం ప్రస్తుతం రచ్చగా మారిందని చెప్పుకొవచ్చు. కొంత మంది ఆమె వ్యవహారాన్ని తప్పుబడుతున్నారు. ఈ క్రమంలో నిహారిక పిక్స్ మాత్రం నెట్టింట తెగ రచ్చ చేస్తున్నాయి.
టాలీవుడ్ లో మెగా ఫ్యామిలీకి ఒక రేంజ్ లో అభిమానులు, అదే విధంగా గుర్తింపు ఉందని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.ఈ కుటుంబం ఒక వైపు వెండితెరపై, మరొవైపు రాజకీయాల్లో కూడా తమదైన శైలీలో రాణిస్తున్నారు
గతంలో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ స్థాపించారు. ఆ తర్వాత మంత్రిగాను పనిచేశారు. అదే విధంగా ప్రస్తుతం ఏపీలో పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ఉన్నారు. నాగ బాబును ప్రస్తుతం మంత్రి వర్గంలో బెర్త్ కన్ఫామ్ అయిందని తెలుస్తొంది.
తెలుగు స్టేట్స్ లలో ఈ కుటుంబం ఎక్కడ ఎలాంటి విపత్తులు జరిగిన, ఏదైన జరిగిన కూడా తమ వంతుగా ఆపన్న హస్తం అందిస్తు ముందు వరుసగా ఉంటున్నారు. అయితే.. ప్రస్తుతం నిహారిక వ్యవహారం మాత్రం సోషల్ మీడియాలో రచ్చగా మారిందని చెప్పుకొవచ్చు.
నిహరిక పెళ్లి జరిగి ఇప్పటికే డైవర్స్ తీసుకున్న విషయం తెలిసిందే.. మళయాళ మూవీ మద్రాస్ కారన్ లో నిహారిక హీరోయిన్ గా నటిస్తున్నారు. షేన్ నిగమ్ హీరోగా నటిస్తున్న.. ఈ మూవీకి వాలి మోహన్ దాస్ దర్శకత్వం వహిస్తున్నారు. .. సఖి సినిమాలోని అలలే పాటను.. కాదల్ సడుగుడు సాంగ్ గ రీమేక్ చేశారు. ఈ క్రమంలో దీనిలో నిహారిక మాత్రం చాలా బోల్డ్ గా నటించినట్లు తెలుస్తొంది.
ఇందులో బెడ్ రూమ్స్ సీన్స్ , చిట్టి గౌను వేసుకుని నిహారిక రెచ్చిపోయినట్లు తెలుస్తొంది. ఈ నేపథ్యంలో దీనిపై మాత్రం మెగా అభిమానులు మాత్రం ఫైర్ అవుతున్నారంట. ఇలాంటి పాత్రలు తీసి మెగా ఫ్యామిలీ ఇజ్జత్ తీస్తున్నావని కొంత మంది నెటిజన్లు నిహారికను ట్రోల్స్ చేస్తున్నారంట.
ఈ క్రమంలో నినహారిక యాంకర్ గా పలు వెబ్ సిరిస్ లు, సినిమాలు చేశారు. నాగశౌర్యతో.. ఒక మనసు, కోలివుడ్ లో విజయ్ సేతుపతితో సినిమా తీశారు. హ్యాపీ వెడ్డింగ్, సూర్యకాంతం తీసినట్లు తెలుస్తొంది.నిహారిక.. నిర్మాతగా. కుమిటీ కుర్రాళ్లను నిర్మించి.. సూపర్ హిట్ కొట్టినట్లు తెలుస్తొంది. అయితే.. ఈ సినిమాలోని బోల్డ్ నటనపై చాలా మంది నెటిజన్లు మండిపడుతున్నారంట.