Niharika Marriage : మెగా ఫ్యామిలీ అంటే తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి పేరు ఉంది అనేది..అందరికీ తెలిసిన విషయమే. ముఖ్యంగా చిరంజీవి అనగానే సీనియర్ ఎన్టీఆర్ తర్వాత అంతటి హీరో అనేది ఎంతోమంది అభిప్రాయం. అలాంటి మెగాస్టార్ ఫ్యామిలీలో చిన్న విషయమైనా సరే సినిమా ఇండస్ట్రీ తో పాటు సినీ ప్రేక్షకులలో కూడా.. తెగ ఆసక్తి తీసుకొస్తుంది..
1/5మెగా ఫ్యామిలీ లో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా సినీ అభిమానులకు సుపరిచితులే. అమ్మాయిలైనా లేదా అబ్బాయిలైనా.. మెగా ఫ్యామిలీలో అందరూ కూడా.. ఏదో ఒక పని ద్వారా బాగా పబ్లిసిటీ తెచ్చుకున్న వాళ్ళే.
2/5ముఖ్యంగా నాగబాబు కూతురు నిహారిక.. తన సినిమాల ద్వారా ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకుంది. హీరోయిన్ గా పెద్ద సక్సెస్ కాలేకపోయినా ప్రస్తుతం నిర్మాతగా మాత్రం దూసుకుపోతోంది. నిహారిక నిర్మాణం వహించిన కమిటీ కుర్రాళ్లు చిత్రం మంచి విజయం సాధించింది.
3/5ఇక ప్రస్తుతం మరికొన్ని సినిమాలో నిర్మించడంలో బిజీగా ఉండి. నిహారిక సినిమాల వల్లే కాకుండా రియల్ లైఫ్ ద్వారా కూడా తరచూ వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్.. పోస్టుల ద్వారా.. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో హైలెట్గా.. నిలుస్తూ వస్తుంది ఈ మెగా డాటర్.
4/5ఇక నిహారికకు గతంలో పెళ్లయి ఆ తర్వాత కొద్ది సంవత్సరాలు విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ విషయం గురించి ఈ మధ్య నాగబాబు మాట్లాడుతూ కూడా.. తన కూతురు విషయంలో తానే తప్పు చేశాను అని ఎమోషనల్ గా రియాక్ట్ అయ్యారు.
5/5ఈ క్రమంలో నిహారిక రెండో పెళ్లి చేసుకోబోతోంది అన్న వార్తలు వైరల్ అవుతున్నాయి. అంతేకాకుండా నిహారికని ఈసారి బయట వ్యక్తికి ఇవ్వాలి అనుకోవడం లేదని.. కాబట్టి సొంత బంధువులకే నిహారికలు ఇచ్చి పెళ్లి చెయ్యాలి అన్న ఆలోచనలో కూడా మెగా ఫ్యామిలీ ఉన్నట్టు వినికిడి. అయితే ఈ విషయంపై ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన మాత్రం రాలేదు.