Banks Strike: బ్యాంకుల సమ్మె వాయిదా.. 24, 25 తేదీల్లో యథావిధిగా పనిచేస్తాయి..!

Banks Strike Postponed: సోమవారం నుంచి వరుసగా రెండు రోజులపాటు బ్యాంకులు సమ్మెలో పాల్గొంటాయి అనే విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో ఖాతాదారులకు అలెర్ట్‌ కూడా ప్రకటించారు. అయితే, మార్చి 24, 25 తేదీల్లో బ్యాంకు ఉద్యోగులు సమ్మె చేయడం లేదు. ఎందుకో ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం..
 

1 /5

ఐదు రోజులు పనిదినాల అమలుకు దేశవ్యాప్తంగా ఉన్న బ్యాంకులు సమ్మెకు దిగనున్నాయనే వార్తలు వచ్చాయి. మార్చి 24, 25 తేదీనా బ్యాంకు యూనియన్స్‌ అధికారికంగా ప్రకటించారు. మార్చి ఆర్థిక సంవత్సరం ముగియడంతోపాటు కేంద్రం నుంచి సానుకూల స్పందన రావడంతో బ్యాంకు ఉద్యోగులు సమ్మె వాయిదా వేస్తున్నట్లు యునైటెడ్‌ ఫోరమ్‌ ఆఫ్‌ బ్యాంక్‌ యూనియన్స్‌ (UFBU) ప్రకటించింది.   

2 /5

వారంలో ఐదు రోజుల పని దినాలు, బ్యాంకు అన్ని క్యాడరల్లలో తగినన్ని నియామకాలు చేపట్టడం వంటి డిమాండ్ల విషయంలో ఇండియన్‌ బ్యాంక్స్‌ అసోసియేషన్‌ (IBA) సమ్మె బాట పట్టాలని చూశాయి. కానీ, కేంద్రం నుంచి సానుకూల స్పందన రావడంతో వాయిదా వేశాయి.  

3 /5

అయితే, నిన్న ఆల్‌ ఇండియా బ్యాంక్‌ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ (AIBEA), UFBU, IBA, DFS, కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ అధికారులు సమావేశం అయ్యారు. ఐదు రోజుల పనిదినాల విషయంపై సానుకూలంగా ఉన్నట్లు డీఎఫ్‌ఎస్‌ జాయింట్‌ సెక్రటరీ  వీడియో కాల్‌లో చెప్పారు.  

4 /5

ఇక ఐబీఏ సమావేశాన్ని ఏప్రిల్‌ మూడో వారానికి వాయిదా వేసింది. సానుకూల స్పందన కేంద్రం నుంచి రావడంతో ఒక నెల లేదా రెండు నెలల వరకు సమ్మె వాయిదా వేశామని AIBEA తెలిపింది. 24, 25 తేదీల్లో సమ్మె చేయడం లేదని చెప్పింది.  

5 /5

ఈ బ్యాంకు సంఘాలు అన్నీ ప్రధానంగా ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో అన్ని స్థాయిల్లో రిక్రూట్మెంట్‌, బ్యాంకు ఉద్యోగులపై దాడుల నిరోధించడానికి చట్టాలు, ప్రతి బ్యాంకులో ఎన్‌పీఎస్‌ యాక్టీవ్‌ ఛాయిస్‌ ఫండ్‌ అమలు చేయాలని, ఇటీవల డీఎఫ్ఎస్‌ పనితీరు ఆదేశాలను కూడా ఉపసంహరించుకోవాలి డిమాండ్లు చేశాయి.