Non Veg Shops Closed: దసరా అంటేనే ముక్కా సుక్కా బంద్. అవును.. నాన్ వెజ్ ప్రియులకు బిగ్ షాక్. ఈరోజు అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా అన్నీ మాంసం దుకాణాలు బంద్ ఉండనున్నాయి. జీహెచ్‌ఎంసీ ఈ మేరకు కఠిన ఆదేశాలు జారీ చేసింది.
1/5నాన్ వెజ్‌ప్రియులకు బిగ్ షాక్ దసరా రోజు ముక్కా.. సుక్కా.. లేనిదే పండుగ కాదు.. అయితే, ఆరోజు గాంధీ జయంతి సందర్భంగా డ్రై డే. ఈ నేపథ్యంలో మద్యం, చికెన్, మటన్ షాపులు బంద్ ఉండనున్నాయి.
2/5హైదరాబాద్‌లో అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా జీహెచ్‌ఎంసీ ఆదేశాలు జారీ చేసింది. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఒకేసారి దసరా, గాంధీ జయంతి సందర్భంగా బంద్ ఉండనున్నాయి.
3/5మున్సిపల్ సిబ్బంది పర్యవేక్షణ చేపట్టి గాంధీ జయంతి పవిత్రతను కాపాడేలా చర్యలు తీసుకుంటామని పేర్కొంది. అటు వైజాగ్‌లోనూ మాంసం దుకాణాలు మాసివేయాలని జీవీఎంసీ ప్రకటన రిలీజ్ చేసింది.
4/5దసరా రోజున మాంసం ప్రియులకు నిరాశ చెందుతున్నారు. ఒక రోజు ముందుగానే మద్యం, మాంసం తీసుకునే అవకాశం ఉంది. సాధారణంగా గాంధీ జయంతి సందర్భంగా ప్రతి ఏడాది ఈరోజు మద్యం, మాంసం షాపులు బంద్ ఉండనున్నాయి.
5/5దసరా రోజున మద్యం దుకాణాలు కూడా ఉండనున్నాయి. గాంధీ జయంతి సందర్భంగా జీహెచ్‌ఎంసీ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆర్డర్‌లు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆదేశించింది. దీంతో నాన్ వెజ్‌ప్రియులకు ఒక రోజు ముందుగానే పండగ చేసుకోవచ్చు.