November 14 School Holiday In Hyderabad: విద్యార్థులకు మరోసారి భారీ గుడ్ న్యూస్. ఎందుకంటే శుక్రవారం 2025 నవంబర్ 14వ తేదీ కూడా స్కూళ్లకు సెలవు ప్రకటించింది ప్రభుత్వం. ఇప్పటికే నవంబర్ 11వ తేదీ మంగళవారం రోజు ఎన్నికల నేపథ్యంలో స్కూళ్లకు సెలవు ప్రకటించింది. తాజాగా బీహార్ రెండో దశ ఎన్నికలు, తెలంగాణ జూబ్లీహిల్స్ ఎన్నికల నేపథ్యంలో నవంబర్ 14వ తేదీ కూడా స్కూళ్లకు సెలవు ప్రకటించారు. ఆ పూర్తి సమాచారం తెలుసుకుందాం..
తెలంగాణ జూబ్లీహిల్స్, బీహార్‌లో ఓట్ల లెక్కింపు సందర్భంగా శుక్రవారం స్కూళ్లకు సెలవు ప్రకటించింది ప్రభుత్వం. 2025 నవంబర్ 14వ తేదీ జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ ఓటింగ్ కౌంటింగ్ నేపథ్యంలో సెలవు రానుంది. అదే విధంగా బీహార్ లో కూడా సెలవు ప్రకటించారు. నవంబర్ 11వ తేదీ అంటే ఈరోజు మంగళవారం ఈ రెండు ప్రాంతాల్లో పోలింగ్ నిర్వహించారు.
అయితే దీనికి సంబంధించిన ఓట్ల లెక్కింపు నవంబర్ 14 శుక్రవారం రోజు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ఆయా ప్రాంతంలోని స్కూళ్లన్నిటికీ సెలవు ఇచ్చారు. బై ఎలక్షన్ నేపథ్యంలో 61-జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం హైదరాబాద్ జిల్లాకు సంబంధించి ఆ ప్రాంతాల్లో కూడా స్కూళ్లకు సెలవు ప్రకటించారు. ఇప్పటికే 10, 11వ తేదీ స్కూళ్లకు సెలవు ప్రకటించారు
నవంబర్ 14వ తేదీ ఓట్ల లెక్కింపు సందర్భంగా కూడా మరో సెలవు కూడా రానుంది. ఇది కూడా పెయిడ్ హాలిడే. ఉప ఎన్నికల సందర్భంగా ఎన్నికల కమిషన్ ప్రకారం నవంబర్ 11వ తేదీ ఎలక్షన్ నిర్వహిస్తున్నారు. బీహార్ లో రెండో విడత ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఇక ప్రభుత్వ కార్యాలయాలతో పాటు విద్యాసంస్థలు కూడా పెయిడ్ హాలిడే ఇప్పటికే ప్రకటించారు.
ఇక జూబ్లీహిల్స్ ఉపఎన్నికల నేపథ్యంలో ప్రధానంగా పోటీ బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్యనే నడవనుంది. ఇక బీజేపీ తరఫున లంకల దీపక్ రెడ్డి బరిలో దిగగా..బీఆర్ఎస్ సునీత గోపీనాథ్, కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్ పోటీలో ఉన్నారు . ఈరోజు ఆరు గంటలకు పోలింగ్ పూర్తవుతుంది. ఇక ఓట్ల లెక్కింపు 2025 నవంబర్ 14వ తేదీ నిర్వహించానున్నారు.
ఈ పోలింగ్ నేపథ్యంలోనే స్కూళ్లకు మిగతా విద్యా సంస్థలకు ఆ నియోజకవర్గంలో సెలవులు ప్రకటించారు. ఇప్పటికే ఆదివారం తో పాటు సోమ, మంగళవారం కూడా వరుసగా మూడు రోజులు స్కూళ్లకు సెలవులు వచ్చాయి. ఇదే వారంలో శుక్రవారం నవంబర్ 14వ తేదీ కూడా స్కూళ్లకు సెలవు రానుంది.