Add Zee Business As A Preferred Source
App

NTR: హైదరాబాద్‌లోని అమెరికా కాన్సులేట్‌కి వెళ్లిన ఎన్టీఆర్.. ఎందుకో తెలుసా..? ఫొటోలు వైరల్..!

Written ByAruna Maharaju
Published: Sep 16, 2025, 07:33 PM IST|Updated: Sep 16, 2025, 07:33 PM IST

Ntr-Prasanth Neel Movie: మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ప్రజెంట్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో ఓ భారీ బడ్జెట్ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల వచ్చిన వార్ 2 ఎన్టీఆర్ ఫ్యాన్స్‌ని నిరాశ పరిచింది. అయితే తాజాగా హైదరాబాద్‌లో ఉన్న అమెరికా కాన్సుల్ జనరల్.. ఎన్టీఆర్‌తో దిగిన ఫోటోలను అధికారిక సోషల్ మీడియా అకౌంట్‌లో షేర్ చేయడంతో.. ఆ పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. 
 

Ntr Prasanth Neel Movie Shooting1/5

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ రీసెంట్‌గా.. వార్ 2 బాలీవుడ్ సినిమాతో రాగా ఆ మూవీ ఆశించినంత హిట్ మాత్రం కొట్టలేదు. ప్రస్తుతం ఎన్టీఆర్.. ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ గురించి ఎప్పుడూ ఏదో న్యూస్ వైరల్ అవుతూనే ఉంది. 

Ntr Prasanth Neel Movie Shooting2/5

రుక్మిణి వసంత్ హీరోయిన్

ఈ సినిమాలో రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ మూవీ కొంత షూటింగ్ ఆల్రెడీ కర్ణాటకలో జరుపుకుంది. అయితే ఈ సినిమా త్వరలో అమెరికాలో షూటింగ్ జరుపుకోనున్నట్లుగా తెలుస్తోంది. 

Ntr Prasanth Neel Movie Shooting3/5

ప్రశాంత్ నీల్

తాజాగా హైదరాబాద్‌లో ఉన్న అమెరికా కాన్సుల్ జనరల్.. ఎన్టీఆర్‌తో దిగిన ఫోటోలను అధికారిక సోషల్ మీడియా అకౌంట్‌లో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి.   

Ntr Prasanth Neel Movie4/5

హైదరాబాద్‌లో ఉన్న అమెరికా కాన్సుల్ జనరల్

ఈ ఫోటోలను షేర్ చేసి.. ఎన్టీఆర్‌కు కాన్సులేట్‌లోకి వెల్‌కమ్. ఎన్టీఆర్ ప్రస్తుతం, రాబోయే ప్రాజెక్ట్ అమెరికాలో షూటింగ్ జరుపుకోనుంది. ఈ క్రమంలో అమెరికా-ఇండియా పార్టనర్ షిప్, జాబ్స్ క్రియేట్ చేయడం, ఇరు దేశాల మధ్య బంధం బలపడనుంది అని రాసుకొచ్చారు.  

Ntr Prasanth Neel Movie5/5

ఎన్టీఆర్, నీల్ సినిమా షూటింగ్ అమెరికాలో

దీంతో ఎన్టీఆర్, నీల్ సినిమా షూటింగ్ అమెరికాలో జరగబోతుందని, అందుకే ఎన్టీఆర్ US కాన్సులేట్‌కి వెళ్లారని సమాచారం. మరి ఎన్టీఆర్, నీల్ సినిమా ఎప్పుడొస్తుందో చూడాలి. ఈ సినిమాకు డ్రాగన్ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. ఈ మూవీ స్క్రిప్ట్ కోసం ప్రశాంత్ నీల్ చాలా టైమ్ తీసుకున్నాడు. కాబట్టి, ఇప్పటి వరకూ నీల్ తీసిన అన్ని సినిమాల్లోకల్లా బెస్ట్ సినిమా ఇదే అవుతుందని అంచనాలు ఉన్నాయి.