Add Zee Business As A Preferred Source
App

NTR Vs ANR Vs Chiranjeevi: ఒకే టైటిల్ ఎన్టీఆర్ ఏఎన్ఆర్ హిట్స్ అందుకుంటే.. చిరు డిజాస్టర్ అందుకున్నాడు..

Written ByTA Kiran Kumar
Published: Sep 12, 2025, 06:32 AM IST|Updated: Sep 12, 2025, 06:35 AM IST

NTR Vs ANR Vs Chiranjeevi: సినీ ఇండస్ట్రీలో ఒకే టైటిల్ తో కొన్నేళ్ళ తర్వాత సినిమాలు రావడం ఎప్పటి నుంచో ఉంది. అలా ఒకే టైటిల్ తో తెరకెక్కిన చిత్రాలతో అన్న ఎన్టీఆర్, అక్కినేని నాగేశ్వరరావులు హిట్స్ అందుకుంటే.. ఆ తర్వాత చాలా కాలం తర్వాత అదే పేరుతో తీసిన సినిమాతో చిరంజీవి డిజాస్టర్ అందుకోవడం విశేషం. ఇంతకీ ఏమిటా చిత్రం..? 

 

NTR Vs ANR Vs Chiranjeevi Same Title1/6

ఎన్టీఆర్, ఏఎన్నార్, చిరంజీవి

NTR Vs ANR Vs Chiranjeevi Same Title: సినిమా ఇండస్ట్రీలో ఒక టైటిల్ పై పేటెంట్ పదేళ్ల వరకు ఉంటుంది. ఆ తర్వాత అదే టైటిల్ ను రిపీట్ చేస్తుంటారు. ప్రతి పదేళ్ల తర్వాత ఒక సినిమా టైటిల్ ను వేరే చిత్రానికి పెట్టొచ్చు.  తెలుగులో ఒకే సినిమా టైటిల్ తో వేరే వేరు సమయాల్లో  పలు చిత్రాలొచ్చాయి. అలా ఒక్కోసారి ఒక చిత్రం టైటిల్ సూపర్ హిట్ అయితే దాన్ని వాడుకోవడానికే ఎక్కువ మంది లైక్ చేస్తుంటారు.అలా ఒకే టైటిల్ తో అక్కినేని నాగేశ్వరరావు, నందమూరి తారక రామారావు, చిరంజీవి ఒకే టైటిల్ తో ఈ ముగ్గురు సినిమాలు రావడం విశేషం. 

 

Aradhana ANR 2/6

అక్కినేని నాగేశ్వరరావు ఆరాధన

1962లో  వి.మధుసూదన రావు డైరెక్షన్ లో ఏఎన్నార్, సావిత్రి హీరో, హీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం  ‘ఆరాధన’. ఈ సినిమాను జగపతి ఆర్ట్స్ పిక్చర్ పతాకంపై వీరమాచనేని బాబు రాజేంద్ర ప్రసాద్  నిర్మించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ చిత్రం  బెంగాలీలో వచ్చిన ‘సాగరిక’మూవీకి  రీమేక్ గా తెరకెక్కించారు. 

 

NTR Aradhana 3/6

ఎన్టీఆర్ ఆరాధన

అక్కినేని ‘ఆరాధన’ తర్వాత 14 యేళ్లకు 1976లో ఎన్టీఆర్, వాణిశ్రీ హీరో,హీరోయిన్లుగా బి.వి. ప్రసాద్ దర్శకత్వంలో  ‘ఆరాధన’ తెరకెక్కింది. ఈ సినిమా హిందీలో వచ్చిన ‘గీత్’ చిత్రానికి రీమేక్ కావడం విశేషం. హిందీలో ‘గీత్’ చిత్రాన్ని హిమాచల్ ప్రదేశ్ నేపథ్యంలో తెరకెక్కింది. తెలుగులో కూడా అదే నేటివిటితో తెరకెక్కించారు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ గా నిలిచింది. 

chiranjeevi Aradhana 4/6

చిరంజీవి ఆరాధన

ఎన్టీఆర్ ‘ఆరాధన’ వచ్చిన 11 యేళ్ల తర్వాత  చిరంజీవి .. భారతీరాజా డైరెక్షన్ లో  గీతా ఆర్ట్స్ బ్యానర్ లో అల్లు అరవింద్ ఈ సినిమాను నిర్మించారు.  ఈ చిత్రం  తమిళంలో సత్యరాజ్ హీరోగా తెరకెక్కిన ‘కవితోరా కవితాంగైల్’ చిత్రానికి రీమేక్. కానీ తెలుగులో మెగాస్టార్ హీరోగా తెరకెక్కిన ‘ఆరాధన’ చిత్రం  బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ గా నిలిచింది. ఈ చిత్రంలో రెండో హీరోగా రాజశేఖర్ నటించారు. 

three Stars Aradhana 5/6

ముగ్గురు స్టార్ హీరోల ఆరాధన

మొత్తంగా అక్కినేని నాగేశ్వరరావు, నందమూరి తారక రామారావు, చిరంజీవి హీరోలుగా తెరకెక్కిన ‘ఆరాధన’ చిత్రాలు కూడా ఇతర భాషల్లో హిట్టైన సినిమాలకు రీమేక్ కావడం విశేషం. అక్కినేనిది బెంగాలీ రీమేక్ అయితే.. నందమూరిది .. హిందీ రీమేక్ అయితే.. చిరంజీవిది.. తమిళ రీమేక్ కావడం విశేషం. 

Aradhana title 6/6

ఆరాధన టైటిల్

మరోవైపు ఏఎన్నార్, ఎన్టీఆర్ లు ‘ఆరాధన’ టైటిల్ తో బ్లాక్ బస్టర్స్  అందుకున్నారు. అదే సమయంలో చిరంజీవి మాత్రం అదే ‘ఆరాధన’ టైటిల్ తో డిజాస్టర్ అందుకోవడం విశేషం.