Oats Dosa Making: మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్ల కారణంగా చాలా మంది రకరకాల డైట్స్ పాటిస్తారు. అయితే చాలామంది బరువు తగ్గాలి అనుకునే వారు, ఫిట్‌నెస్ మెయిన్‌టైన్ చేయాలనుకునేవారు ఉదయాన్నే ఇడ్లీ, దోశ బదులు ఓట్స్ తింటారు. అయితే దోశలంటే ఎక్కువ ఇష్టం ఉన్నవాళ్లు తమ డైట్ నుంచి బయటకు రాకుండా దోశలు తినే అవకాశం ఉంది. అదెలాగో ఇప్పుడు చూద్దాం.
1/6మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్ల కారణంగా చాలా మంది రకరకాల డైట్స్ పాటిస్తారు. అయితే చాలామంది బరువు తగ్గాలి అనుకునే వారు, ఫిట్‌నెస్ మెయిన్‌టైన్ చేయాలనుకునేవారు ఉదయాన్నే ఇడ్లీ, దోశ బదులు ఓట్స్ తింటారు. అయితే దోశలంటే ఎక్కువ ఇష్టం ఉన్నవాళ్లు తమ డైట్ నుంచి బయటకు రాకుండా దోశలు తినే అవకాశం ఉంది. అదెలాగో ఇప్పుడు చూద్దాం.
2/6సాధారణంగా మినపప్పు, రాగులు, పెసరపప్పుతో చేసిన దోశలను తింటుంటాము. అయితే డైటింగ్ చేసే వారి కోసం ప్రత్యేకంగా ఓట్స్ దోసను 10 నిమిషాల్లో తయారు చేయవచ్చు. అధిక ప్రోటీన్, తక్కువ కేలరీలతో కూడిన ఆరోగ్యకరమైన టిఫిన్‌గా ఈ ఓట్స్ దోశ ఉంటుంది.
3/6అర కప్పు ఓట్స్‌ను కొద్దిగా నానబెట్టి బ్లెండర్ లేదా మిక్సర్-గ్రైండర్‌లో మెత్తగా రుబ్బుకోవాలి. అందులో పావు కప్పు ఉప్మా రవ్వను కలపాలి. ఆ తర్వాత కొద్దిగా పావు కప్పు బియ్యపు పిండి కలపాలి. చివరిగా అర కప్పు పెరుగు వేసి, కొద్దిగా నీరు పోసి, పేస్ట్‌లా చేసుకోని బాగా కలపాలి.
4/6దీనికి పావు కప్పు సన్నగా తరిగిన ఉల్లిపాయ, 1 టీస్పూన్ తరిగిన అల్లం, 1 టీస్పూన్ సన్నగా తరిగిన పచ్చిమిర్చి, కొత్తిమీర, సన్నగా తరిగిన కరివేపాకు వేసి బాగా కలపాలి.
5/6అర టీస్పూన్ జీలకర్ర, పావు టీస్పూన్ నల్లమిరియాల పొడి, తగినంత ఉప్పు వేసి కలుపుకోవాలి. అవసరమైతే కొద్దిగా కొబ్బరి తురుమును కూడా కలుపుకోవచ్చు. బాగా కలిపి 10 నిమిషాలు పక్కన పెట్టాలి.
6/6చివరిగా మీరు నాన్-స్టిక్ పాన్‌కి కొద్దిగా నెయ్యి లేదా నూనె రాసి ఓట్స్ దోశను వేసుకొని తిని ఎంజాయ్ చేయోచ్చు. ఇది శనగవిత్తనాల చట్నీ, కొబ్బరి చట్నీతో కలిపి తింటే అద్భుతం.