Add Zee Business As A Preferred Source
App

OG Records:‘OG’ మూవీతో పవన్ కళ్యాణ్ ఖాతాలో పలు రికార్డులు.. ఇది కదా పవర్ స్టార్ రేంజ్..

Written ByTA Kiran Kumar
Published: Sep 29, 2025, 07:02 AM IST|Updated: Sep 29, 2025, 07:05 AM IST

OG Records for Pawan Kalyan: ఏపీ డిప్యూటీ అయిన యేడాది తర్వాత పవన్ కళ్యాణ్ నటించిన చిత్రాలు వరుసగా విడుదల అవుతున్నాయి. ముందుగా ‘హరి హర వీరమల్లు’  చిత్రంతో పలకరించారు. ఈ చిత్రం పెద్దగా అలరించలేదు. తాజాగా ‘ఓజీ’ మూవీతో ఆడియన్స్ ముందుకు వచ్చారు. ఈ సినిమా మిక్స్ డ్ టాక్ తో పవన్ కళ్యాణ్ కెరీర్ లో పలు రికార్డులను బ్రేక్ చేస్తూ దూసుకుపోతుంది. 

 

OG Records for Pawan Kalyan1/5

ఓజీ రికార్డ్స్ ఫర్ పవన్ కళ్యాణ్

OG Records for Pawan Kalyan: ‘OG’ మూవీ పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే అత్యధిక వసూళ్లను రాబట్టిన చిత్రంగా రికార్డులకు ఎక్కింది. ఓజీ చిత్రాన్ని ముందుగా గతేడాది సెప్టెంబర్ 27న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. రాజకీయాల్లో బిజీగా ఉండటంతో   యేడాది ఆలస్యంగా ఈ ఇయర్ సెప్టెంబర్ 25న  విడుదలైంది. 

OG Highest Pre Release Business 2/5

OG అత్యధిక ప్రీ రిలీజ్ బిజినెస్

‘ఓజీ’ చిత్రం పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే అత్యధిక ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన చిత్రంగా రికార్డులు ఎక్కింది. దాదాపు 172.50 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. రూ. 174 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో రంగంలోకి దిగింది. అంతేకాదు పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే తొలి రోజు రూ. 100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టిన తొలి  చిత్రంగా రికార్డులకు ఎక్కింది.  ఈ సినిమా ఫస్ట్ డే వరల్డ్ వైడ్ గా రూ. 92 కోట్ల షేర్ (రూ. 154 కోట్ల గ్రాస్) రాబట్టి సంచలనం రేపింది. 

OG 3/5

ఓజీ

అంతేకాదు ‘ఓజీ’ మూవీతో ఓవర్సీస్ లో తొలి బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకొని సంచలనం రేపింది. ఇది కూడా పవన్ కళ్యాణ్ కెరీర్లో ఓ రికార్డు. అంతేకాదు రెండు రోజుల్లో రూ. 100 కోట్ల షేర్ రాబట్టింది. పవన్ కళ్యాణ్ లో తొలి వంద కోట్ల షేర్ రాబట్టిన తొలి చిత్రంగా  రికార్డులకు ఎక్కింది. 

OG 200 Crores 4/5

ఓజీ రూ. 200 కోట్ల గ్రాస్

పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే తొలి రూ. 200 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టిన చిత్రంగా రికార్డులకు ఎక్కింది.  ‘ఓజీ’ మూవీ మూడు రోజుల్లో రూ. 202 కోట్ల గ్రాస్ (రూ.126 కోట్ల షేర్) రాబట్టింది. ఆదివారం నాలుగు రోజుల్లో కలిపి  ‘ఓజీ’ మూవీ ప్రపంచ వ్యాప్తంగా రూ.  235 కోట్ల గ్రాస్ (రూ. 145 కోట్ల షేర్ ) రాబట్టినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమా ఇంకా బాక్సాఫీస్ దగ్గర రూ.30 కోట్ల షేర్ రాబట్టాల్సిన అవసరం ఉంది. 

Pawan Kalyan First Break Even 5/5

పవన్ కళ్యాణ్ ఫస్ట్ బ్రేక్ ఈవెన్

అంతేకాదు ఓవర్సీస్ లో నాలుగు రోజుల్లో $5 మిలియన్  యూఎస్ డాలర్స్ రాబట్టిన తొలి పవన్ కళ్యాణ్ చిత్రంగా రికార్డులకు ఎక్కింది. ఈ సినిమా  పవన్ కళ్యాణ్ కెరీర్ లో తొలి రూ. 250 కోట్ల గ్రాస్ రాబట్టిన చిత్రంగా రికార్డులకు ఎక్కనుంది. ఈ మూవీతో రూ. 300 కోట్ల గ్రాస్ క్లబ్బులో ప్రవేశిస్తుందా లేదా అనేది చూడాలి. ఇప్పటి వరకు ‘ఓజీ’ సినిమా 80 శాతం బిజినెస్ రికవరీ పూర్తి చేసుకుంది. త్వరలో బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకొని చాలా యేళ్ల తర్వాత తొలి బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకోబోతున్న పవన్ కళ్యాణ్ చిత్రంగా రికార్డులకు ఎక్కుతుందా అనేది చూడాలి.