Add Zee Business As A Preferred Source
App

OG Movie First Review: OG మూవీ ఫస్ట్ రివ్యూ .. బొమ్మ బ్లాక్ బస్టరేనా..!

Written ByTA Kiran Kumar
Published: Sep 23, 2025, 12:04 PM IST|Updated: Sep 23, 2025, 12:04 PM IST

OG Movie First Review: ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి ఓ వైపు పాలిటిక్స్ చేస్తూనే.. మరోవైపు చేతిలో ఉన్న సినిమాలు చేస్తున్నారు. ఈ క్రమంలో రీసెంట్ గా ‘హరి హర వీరమల్లు’తో పలకరించారు. తాజాగా ఇపుడు ‘ఓజీ’ మూవీతో పలకరించబోతున్నాడు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని విడుదలకు సిద్దంగా ఉంది. తాజాగా విడుదలకు రెండు రోజులు ముందు విడుదల చేసిన ట్రైలర్ తో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. 

OG Movie First Review1/6

OG ఫస్ట్ రివ్యూ

OG Movie First Review: పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘ఓజీ’. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ‘ఓజాస్ గంభీర’ ఓజీ పాత్రలో కనిపించనున్నారు.  ఈ నెల 25న విడుదల కానున్న ఈ సినిమాను 24 రాత్రి నుంచే స్పెషల్ ప్రీమియర్స్ పడనున్నాయి. ఇప్పటికే ఈ టికెట్స్ అన్నితిరుమల లడ్డూ ప్రసాదంలా క్షణాల్లో అమ్ముడైపోయాయి. 

OG Trailer 2/6

ఓజీ ట్రైలర్

తాజాగా విడుదల చేసిన ట్రైలర్ తో ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకాయి. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ చెప్పిన డైలాగులు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. నా కొడకల్లారా తలలు జాగ్రత్త అంటూ పవన్ ఓజీలో చెప్పిన డైలాగులు నెట్టింట హల్ చల్ చేస్తోంది. ముఖ్యంగా ప్రతిపక్ష నేతలను టార్గెట్ చేస్తూ ఈ డైలాగ్ ఉందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. 

OG Censor Certificate 3/6

ఓజీ సెన్సార్ సర్టిఫికేట్

తాజాగా ‘ఓజీ’ మూవీకి సెన్సార్ వాళ్లు ‘A’ సర్టిఫికేట్ జారీ చేసారు. అంతేకాదు ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ డాన్ గా ఇరగదీసాడనేది చూపించారు. ముఖ్యంగా ముంబై మాఫియా నేపథ్యంలో ఈ సినిమాను 90ల నేపథ్యంలోతెరకెక్కించినట్టు చెప్పారు. 

 

OG Censor Talk 4/6

ఓజీ సెన్సార్ టాక్

ఇందులో పవన్ పాత్ర అభిమానులతో పాటు కామన్ ఆడియన్స్ కు ఆకట్టుకునే విధంగా ఉందని చెబుతున్నారు. ఈ సినిమా నిడివి  154.15 గంటల 34 నిమిషాలు ఉంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదలైన తర్వాత టాప్ ట్రెండింగ్ లో ఉంది. అటు పవన్ మేనల్లుడు సాయి దుర్గ తేజ్.. కూడా తన రివ్యూ చెప్పేసాడు. 

Bengal Tiger 5/6

బెంగాల్ టైగర్

‘మేం ఇన్నాళ్లుగా మిస్ అవుతున్న బెంగాల్ టైగర్ ఇప్పుడు వేటకు బయల్దేరింది..నాతో సహా ప్రతీ అభిమాని కోరిక తీర్చిన, అందరినీ సంతృప్తి పరిచిన సుజీత్ కి ధన్యవాదాలు తెలిపారు. ట్రైలర్‌ అద్భుతంగా ఉందన్నారు. నా దోస్తు తమన్ ఇచ్చిన బీజీఎం అయితే నిజంగానే ఫైర్ స్ట్రామ్ అని కొనియాడారు.  

Pawan Kayan OG Sai Dharam Tej 6/6

పవన్ కళ్యాణ్ ఓజీ మూవీపై సాయి ధరమ్ తేజ్

అంతేకాదు నా గురువు కమ్ హీరో పవన్ కళ్యాణ్ మావయ్య.. ప్రతి ఫేమ్ లో అద్భుతంగా కనిపించారు. ఈయన స్వాగ్, స్టైల్ నెవర్ బిఫోర్.. నెవర్ ఆఫ్టర్ అనే విధంగా ఉంది. ఈ సినిమా కోసం అభిమానులతో నేను కూడా కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్టు తెలిపాడు.