Add Zee Business As A Preferred Source
App

OG Movie: OGలో పవన్ కళ్యాణ్ ఎంత మందిని ఊచకోత కోసాడు.. చెబితే మీరు తోపే..

Written ByTA Kiran Kumar
Published: Sep 25, 2025, 10:17 PM IST|Updated: Sep 26, 2025, 07:19 AM IST

OG Movie Updates: OGలో పవన్ కళ్యాణ్ ఎంత మందిని ఊచకోత కోసాడు.. చెబితే మీరు తోపే.. ప్రస్తుతం నెట్టింట ఈ వార్త్ హల్ చల్ చేస్తోంది. అవును పవన్ కళ్యాణ్ ఈ చిత్రంలో ఎంత మంది చంపాడనే లెక్క చెబితే.. కోటి రూపాయలు ఇస్తామని చెబుతున్నారు కొంత మంది. 

OG Movie Updates1/5

ఓజీ మూవీ అప్ డేట్స్

OG Movie Updates: ఈ మధ్య కాలం అని కాదు కానీ.. సినిమా పుట్టినప్పటి నుంచి హీరోలు.. ప్రత్యర్థులను ఊచకోత కోయడమనేది ఉంది. అప్పట్లో ఎన్టీఆర్ సహా అప్పటి అగ్రహీరోలు నటించిన జానపద, చారిత్రక, సాంఘిక, పౌరాణిక చిత్రాల్లో ప్రత్యర్థులకు చెందిన వాళ్లను ఊచకోత  కోయడం అనేది ఎప్పటి నుంచో ఉంది. 

OG 2/5

ఓజీ

రామాయణం, మహా భారతాల్లో కూడా దుష్ట శిక్షణ శిష్ట రక్షణలో భాగంగా ప్రత్యర్థులను శత్రు సంహారం చేయడమనేది  ఉంది. ఆ సంగతి పక్కన పెడితే.. ఈ మధ్యకాలంలో వస్తోన్న చిత్రాల్లో మన  హీరోలు.. కూరగాయలను తరిగినట్టు మెడకాయలను  నరికేస్తున్నారు.  ఓజీలో కూడా పవన్ కళ్యాణ్ తన కత్తికి ఎంతో మందిని బలి చేస్తాడు. 

 

OG Narakadam 3/5

ఓజీ నరకడం

ఈ మధ్యకాలంలో వచ్చిన చాలా చిత్రాలను పరిశీలిస్తే.. హీరోలను ప్రత్యర్థులను నరికి చంపడం అనేది కామన్ పాయింట్ అయిపోయింది. ఇందులో చిరు, బాలయ్య, వెంకీ, నాగ్, ప్రభాస్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, మహేష్ బాబు, రామ్ చరణ్, నాని సహా ఎవరు  మినహాయింపు కాదు. ఎంత మందిని చంపితే అంత గొప్ప అనేలా హీరో ఎలివేషన్ సీన్స్ ప్లాన్ చేస్తున్నారు దర్శకులు.

Pawan Kalyan 4/5

పవన్ కళ్యాణ్

అప్పట్లో వచ్చిన వీరసింహారెడ్డి, భోళా శంకర్.. ఆ తర్వాత నాని నటించిన ‘హిట్ 3’లో ప్రత్యర్థుల ఊచకోత ఓ రేంజ్ లో ఉంటుంది. తాజాగా పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ‘ఓజీ’  అందుకు మినహాయింపు ఏమి కాదు. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ ఎంత మందిని ఊచకోత కోసాడనేది లెక్క పెట్టడం ఎవరి తరం కాదు. లెక్క పెట్టినవాడికి కోటి రూపాయలు ఇచ్చిన తక్కువే అంటున్నారు నెటిజన్స్. 

 

Premiers og 5/5

ప్రీమియర్స్ ఓజీ

‘ఓజీ’ సినిమా ప్రారంభం నుంచి మొదలు పెడితే.. చివరి వరకు అంతా రక్తపాతమే.. ఓ సందర్భంలో ప్రత్యర్థులను చంపిన రక్తంతో తడిసిన ఓజీ షర్ట్ ను జెండాలా అక్కడి హార్బర్ లో ఎగరేస్తారు. మొత్తంగా చూస్తే ఓ మూవీని మూవీగానే  చూడాలి. సినిమాలో ఉన్నది  నిజ జీవితంలో ఉండదు. మొత్తంగా చూసుకుంటే పవన్ కళ్యాణ్ తో హీరోగా నటించిన ఓజీ చిత్రం పవర్ స్టార్ కెరీర్ లోనే అత్యధిక వసూళ్లను రాబట్టే చిత్రంగా నిలిచే అవకాశాలున్నాయి.