Add Zee Business As A Preferred Source
App

OG: OGలో అసలు హీరో పవన్ కళ్యాణ్ కాదా.. బిగ్ ట్విస్ట్ ఇదే..!

Written ByTA Kiran Kumar
Published: Sep 25, 2025, 10:25 PM IST|Updated: Sep 25, 2025, 10:25 PM IST

OG Movie Pawan Not Real Hero: పవన్ కళ్యాణ్ హీరోగా ప్రియాంక అరుల్ మోహన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఓజీ’ (OGs).  సుజిత్ దర్శకత్వంలో డీవీవీ దానయ్య నిర్మాణంలో తెరకెక్కిన చిత్రం. ఈ రోజు విడుదలైన OGలో అసలు హీరో పవన్ కళ్యాణ్ కాదా.. సినిమా విడుదల తర్వాత పవన్ ఫ్యాన్స్ తో పాటు కామన్ ఆడియన్స్ ఇదే విషయమై చర్చించుకుంటున్నారు.  

1/6

OG Movie Pawan Kalyan not Real Hero: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ‘ఓజీ’ సినిమా నిన్న సాయంత్రం నుంచే ప్రీమియర్స్ పడగా.. అభిమానులకు మాత్రం పిచ్చి పిచ్చిగా నచ్చేసింది. తమ అభిమాన హీరోను ఎలా చూడాలనుకుంటున్నామో.. అలా దర్శకుడు సుజిత్ చూపెట్టాడని ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. 

Sujeeth Rotinue 2/6

సుజిత్ రొటిన్

మరోవైపు కామన్ ఆడియన్స్ తో పాటు క్రిటిక్స్  మాత్రం సుజిత్ రొటీన్ రొడ్డకొట్టుడు స్టోరీని మాత్రమే తెరకెక్కించాడు. దానికి 90ల నాటి బ్యాక్ గ్రౌండ్ ను ఎంచుకున్నాడనే కామెంట్స్ చేస్తున్నారు. మరోవైపు సుజిత్ టేకింగ్ ను మెచ్చుకుంటున్నారు. 

Pawan Kalyan Elivation Scenes3/6

పవన్ కళ్యాణ్ ఎలివేషన్ సీన్స్

ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఎలివేషన్ సీన్స్  చూపెట్టడంలో సక్సెస్ అయ్యాడనే చెబుతున్నారు. ముఖ్యంగా ఇంటర్వెల్ ముందు ఫైట్ సీన్ తో పాటు.. ఇంటర్వెల్ తర్వాత పోలీస్ స్టేషన్ సీన్ తో పాటు కొన్ని సన్నివేశాల్లో పవన్ కళ్యాణ్ ను చూపించిన విధానం బాగుంటున్నారు. 

 

OG Climax 4/6

ఓజీ క్లైమాక్స్

ఇక క్లైమాక్స్ లో అప్పటి బాంబే బాంబ్ బ్లాస్ట్ ను తన సమురాయ్స్ తో కలిసి ఎలా ఆపగలిగాడనేది కాస్త లాజిక్ కు అందదు. మరోవైపు హీరో, హీరోయిన్ ఎలా ప్రేమలో పడ్డారనేదానిపై క్లారిటీ ఇస్తే బాగుండేది. ఒక డాక్టర్.. ముక్కు మొఖం తెలియని వ్యక్తిని ఎలా ప్రేమించి పెళ్లి చేసుకుందనేది లాజిక్ కు అందదు. 

 

Thaman Music 5/6

తమన్ మ్యూజిక్

ఆ సంగతి పక్కన పెడితే.. ఓజీలో అసలు హీరో పవన్ కళ్యాణ్ కాదంటున్నారు. మరి ఎవరనేగా డౌటు.. ఈ సినిమాను మ్యూజిక్ ఇచ్చిన తమన్.. ఫస్ట్ సీన్ నుంచి లాస్ట్ సీన్ వరకు సినిమాకు ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కు థియేటర్స్ లో  సౌండ్ బాక్సులు పగిలేపోంత రేంజ్ లో ఉందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. 

 

Thaman Background Score 6/6

తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్

ఈ  రకంగా సుజిత్ టేకింగ్, పవన్ స్వాగ్ కు తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదిరిపోవడంతో ఓజీ సినిమాకు అసలు సిసలు హీరో తమన్ అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా తమన్ మాత్రం ‘ఓజీ’కి ఇచ్చిన మ్యూజిక్ కామన్ ఆడియన్స్ కూడా ఆయన పనితనాన్ని మెచ్చుకుంటున్నారు.