Add Zee Business As A Preferred Source
App

Olive oil benefits for grey hair: తెల్లజుట్టుతో బాధపడుతున్నారా..! ఈ చిన్ని చిట్కాతో శాశ్వతంగా నల్లగా మార్చుకోండి..

Written ByTA Kiran Kumar
Published: Sep 04, 2025, 10:53 AM IST|Updated: Sep 04, 2025, 10:53 AM IST

Olive oil benefits for grey hair: ఒకపుడు మన తాతలు, నాన్నల జమానాలో 50 యేళ్లు పై బడిన వాళ్లకే జుట్టు కాస్త తెల్లబడేది. కానీ ఇప్పటి జనరేషన్ లో కల్తీ ఫుడ్ తో పాటు వాతావరణ మార్పులతో చిన్నపుడే బాల నెరుపుతూ  తెల్ల జుట్టుతో చాలా మంది బాధపడుతుంటారు. అందుకే చాలా మంది యంగ్ కనపడడానికి హెయిర్ డై వంటివి వాడుతుంటారు. కానీ ఈ చిన్ని చిట్కాతో ఈజీగా మీ తెల్ల జుట్టును శాశ్వతంగా నల్లగా మార్చుకోవచ్చు. 

 

Olive oil benefits for grey hair1/6

ఆలివ్ ఆయిల్ బెనిఫిట్స్

Olive oil benefits for grey hair: అయితే సహజంగా కొన్ని పద్దతుల ద్వారా తెల్ల జుట్టు సమస్యకు చెక్ పెట్టొచ్చు. మనం తలకు మర్దన చేసుకోవడానికి  సాధారణంగా కొబ్బరినూనె కాకుండా.. ఆముదం, ఆవ నూనె, బాదం నూనె, ఆలివ్ నూనె వంటివి వాడుతుంటాము. 

White Hair Oil Problem 2/6

తెల్ల జుట్టు సమస్య

ఇతర జుట్టు నూనెల మాదిరిగానే, ఆలివ్ నూనె కూడా తెల్ల జుట్టు సమస్యకు దాదాపు శాశ్వతమైన  పరిష్కారం లభించేలా చేస్తుంది.  ఇందులో, ఉల్లిపాయ, నిమ్మకాయ రసాలను ఆలివ్ నూనెలో కలిపి తలకు మర్దన చేయడం ద్వారా కొన్ని రోజుల్లో తెల్ల జుట్టు నల్లగా మారే అవకాశాలున్నాయి.

Kovvu Amlalu 3/6

కొవ్వు ఆమ్లాలు

ఆలివ్ ఆయిల్ లోని కొవ్వు ఆమ్లాలు జుట్టు రాలే  సమస్యకు అద్భుతమైన చికిత్సగా పనిచేస్తున్నాయి.  ఇది తెల్ల జుట్టు సమస్య నుండి కూడా రక్షిస్తుంది. ఉల్లిపాయ రసం జుట్టును నల్లగా చేసే ఎంజైమ్ ఉత్ప్రేరకాన్ని పెంచడంలో తోడ్పడుతుంది. 

Lemon Rasam 4/6

నిమ్మకాయ రసం

నిమ్మకాయలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది సహజంగా జుట్టును ప్రకాశవంతం చేయడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది. ముందుగా, ఒక గిన్నెలో, 1 చెంచా ఆలివ్ నూనె, 2-3 స్పూన్ ల ఉల్లిపాయ రసం, 1 టీ స్పూన్  నిమ్మరసం కలిపి బాగా కలపండి. తరువాత, ఈ నూనెను మీ జుట్టుకు అప్లై చేసి, తలపై బాగా మర్దన చేసుకోవాలి. 

Olive Oil Mix 5/6

ఆలివ్ ఆయిల్

ఆలివ్ ఆయిల్ మిశ్రమాన్ని మీ జుట్టుకు అప్లై చేసిన గంట తర్వాత, గోరువెచ్చని నీటితో తేలికపాటి షాంపూతో మీ జుట్టును కడగాలి. ఇది మీ తెల్ల జుట్టును సహజంగా నల్లగా  చేయడంలో దోహదం చేస్తుంది. అది కూడా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా..

Disclaimer6/6

గమనిక

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం కొంత మంది నిపుణులు, డాక్టర్లు ఇచ్చిన కొన్ని మ్యాగజైన్స్ లో వాళ్లు చెప్పిన సమాచారం ఆధారంగా ఇవ్వబడిన స్టోరీ.  ZEE NEWS దీనిని ధృవీకరించడం లేదు. వీటిని అప్లై చేసే ముందు నిపుణులైన డాక్లర్టను సంప్రదించాలి.