Manchu Manoj: మళ్లీ మంచు మనోజ్‌ భావోద్వేగం.. ఈసారి దేనికో తెలుసా?

Manchu Manoj Emotional In Instagram: కుటుంబంలో ఆస్తిపాస్తుల వివాదం నేపథ్యంలో సినీ హీరో మంచు మనోజ్‌ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. ఈ సమయంలో మరోసారి భావోద్వేగానికి లోనయ్యాడు. అయితే ఈసారి కుటుంబ వివాదంపై కాకుండా తన తల్లి నిర్మల జన్మదినం సందర్భంగా మనోజ్‌ ఉద్విగ్నానికి గురయ్యాడు. తన తల్లికి శుభాకాంక్షలు చెబుతూ ట్వీట్‌ చేయడం వైరల్‌గా మారింది.

1 /7

రచ్చకెక్కిన కుటుంబం: మంచు కుటుంబంలో ఆస్తిపాస్తుల వివాదం రచ్చకెక్కిన విషయం తెలిసిందే. ముఖ్యంగా మంచు మనోజ్‌ తీవ్ర ఇబ్బందులు పడుతున్నాడు.

2 /7

తండ్రీకొడుకుల గొడవ: తండ్రి మంచు మోహన్‌ బాబు, విష్ణుతో గొడవల నేపథ్యంలో మనోజ్‌ తీవ్ర మనస్తాపానికి లోనయ్యాడు.

3 /7

ఉద్వేగం: గొడవలు కొనసాగుతున్న సమయంలోనే మంచు మనోజ్‌ మరోసారి ఉద్విగ్నానికి గురయ్యాడు. తన తల్లి మంచు నిర్మల జన్మదినం సందర్భంగా అతడు ఆమెకు శుభాకాంక్షలు తెలిపాడు.

4 /7

శుభాకాంక్షలు: ఇన్‌స్టాగ్రామ్‌లో మనోజ్‌ తన తల్లికి జన్మదిన శుభాకాంక్షలు చెబుతూ ఒక పోస్టు చేశాడు. ఈ సందర్భంగా తన తల్లిపై ఉన్న ప్రేమను చాటుకున్నాడు.

5 /7

తల్లిపై ప్రేమ: 'మన కుటుంబానికి నువ్వు గుండెలాంటిదానివి. నీ ప్రేమ.. కరుణ వల్లే అంతా కలిసి ఉండగలుగుతున్నాం' అంటూ నిర్మలకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపాడు.

6 /7

ఇన్‌స్టాలో పోస్టు: 'పుట్టినరోజు శుభాకాంక్షలు అమ్మ. నీ ధైర్యం నన్ను ప్రతిరోజూ స్ఫూర్తినిస్తోంది. నీ ప్రేమాభిమానాల వల్లే అందరం కలిసి ఉన్నాం. నీకు ఎల్లప్పుడూ మంచి జరగాలని.. సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా. ఏం జరిగినా సరే నువ్వు ఎప్పుడూ మాకు అండగా నిలబడ్డావు. నేను నీకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటా. నిన్ను అమితంగా ప్రేమిస్తున్నా తల్లీ' అంటూ మనోజ్‌ ఇన్‌స్టాలో పోస్టు చేశాడు.

7 /7

కొంత విరామం: కొందరు కుటుంబపెద్దలు, సినీ పెద్దలు కలిసి మంచు కుటుంబంలో గొడవలను ఆపారని తెలుస్తోంది. అందరి సమక్షంలో చర్చలు జరిగి వివాదానికి తాత్కాలిక విరామం ఇచ్చినట్లు తెలుస్తోంది.