Janhvi Kapoor latest news: జాన్వీకపూర్ ప్రస్తుతం బుచ్చిబాబు దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో 'RC 16'లో చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ గురించి ఒక ఆసక్తికర అంశం ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.
1/6దివంగత నటి శ్రీదేవి చనిపోయి ఏళ్లు గడుస్తున్న ఇప్పటికి కూడా వెండితెరపై అతిలోక సుందరికి ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఏమాత్రం తగ్గలేదు. తన అందం, అభినయంతో శ్రీదేవీ ఆరెంజ్ లో అభిమానుల్ని సొంతం చేసుకుంది.
2/6ప్రస్తుతం శ్రీదేవీ గారాల కూతురు జాన్వీకపూర్ సైతం.. తన తల్లిలాగే ఇండస్ట్రీలో నటనతో మంచి పేరు తెచ్చుకుంటుంది. ఇటీవల జాన్వీకపూర్ ఎక్కువగా వార్తలలో ఉంటున్నారు. తాజాగా.. రామ్ చరణ్ తో.. 'RC 16' వర్కింగ్ టైటిల్ మూవీని బుచ్చిబాబు తెరకెక్కిస్తున్నారు.
3/6దీని షూటింగ్ నడుస్తుంది. ఈ క్రమంలో ఇటీవల జాన్వీకపూర్ కు ఆరోగ్యం బాగాలేదని.. ఆమెను వైద్యులు రెస్ట్ తీసుకొవాలని చెప్పారంట. కానీ జాన్వీపాప మాత్రం.. దాన్ని లెక్కచేయకుండా.. ట్యాబ్లెట్స్ వేసుకుంటూ.. షూటింగ్ కు ఏమాత్రం ఇబ్బంది కల్గకుండా చూసుకుంటుందంట. చివరకు మూవీ టీమ్ కూడా రెస్ట్ తీసుకొమన్న కూడా జాన్వీకపూర్ అస్సలు రెస్ట్ తీసుకొవట్లేదంట.
4/6గతంలో చిరంజీవితో, శ్రీదేవీ జగదేక వీరుడు అతిలోక సుందరీ మూవీ తీసినప్పుడు.. శ్రీదేవీ ఆరోగ్యం కూడా కాస్త పాడైందంట. కానీ శ్రీదేవీ మాత్రం మూవీ టీమ్ కు నష్టం రావొద్దని, అనుకున్న షెడ్యూల్ ప్రకారం సినిమా పూర్తి కావాలని తన హెల్త్ ను కూడా పక్కన పెట్టి షూటింగ్ కు వచ్చిందంట. ఇప్పుడు జాన్వీ కూడా అలాగే చేస్తుండటంతో ఈ విషయం వైరల్గా మారింది.
5/6అప్పుడు చిరుతో శ్రీదేవీ మూవీస్ విషయంలో ఎంత డెడికేషన్ గా ఉందో.. ఇప్పుడు జాన్వీకపూర్ సైతం... రామ్ చరణ్ తో అంతే డెడికేష్ తో 'RC 16' మూవీలో చేస్తుందని ఒక వార్త నెట్టింట తెగ హల్ చల్ చేస్తుంది. మరీ దీంట్లో ఎంత నిజముందో కానీ..జాన్వీపాపను మాత్రం నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.
6/6మరోవైపు.. రామ్ చరణ్ పుట్టినరోజు కానుకగా మార్చి 27న 'RC 16' గ్లింప్స్ విడుదలయ్యే అవకాశముందని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతుంది. దీంతో మెగా అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. మరికొందరు మాత్రం మార్చి 27న ఉండకపోవచ్చని కూడా అంటున్నారు. మొత్తంగా మూవీ టీమ్ అధికారికంగా ప్రకటిస్తేనే దీనిపై ఒక క్లారిటీ వస్తుందని చెప్పుకొవచ్చు.