BRS Party Panchangam: మాజీ సీఎం కేసీఆర్‌, కేటీఆర్‌ పంచాంగం ఎలా ఉందో తెలుసా?

Know How This Year To KCR And KT Rama Rao: ఉగాది పండుగను ప్రపంచవ్యాప్తంగా తెలుగు ప్రజలు ఆనందోత్సాహాలతో చేసుకున్నారు. కొత్త సంవత్సరాన్ని ఆత్మీయంగా ఆహ్వానం పలికారు. తెలంగాణలో బీఆర్‌ఎస్‌ పార్టీ నిర్వహించిన ఉగాది పండుగ సంబరాలు ప్రత్యేకంగా నిలిచాయి. తెలంగాణ భవన్‌లో జరిగిన పంచాంగ శ్రవణం ఆసక్తికరంగా సాగింది. కేసీఆర్‌, కేటీఆర్‌ పంచాంగం.. బీఆర్‌ఎస్‌ పార్టీ భవిష్యత్‌ ఎలా ఉందో తెలుసుకుందాం.

1 /8

ఉగాది పండుగ సంబరాలు భారత రాష్ట్ర సమితి పార్టీ ప్రధాన కార్యాలయం తెలంగాణ భవన్‌లో వైభవంగా జరిగాయి. ఈ వేడుకల్లో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్, మాజీ మంత్రులు శ్రీనివాస్‌ గౌడ్‌, సత్యవతి రాథోడ్‌, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌తోపాటు పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.

2 /8

పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం పంచాంగ శ్రవణం జరిగింది. రాజేశ్వర సిద్ధాంతి  పంచాంగ పఠనం చేశారు. ఈ పంచాంగ పఠనం ఆసక్తికరంగా సాగింది. పార్టీ పరిస్థితి.. నాయకుల విజయాలు, రాష్ట్ర, జాతీయ, ప్రపంచ పరిణామాలు ఎలా ఉన్నాయో సిద్ధాంతి పంచాంగంలో వినిపించారు.

3 /8

'సంవత్సరం ప్రారంభంలోనే ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో భూకంపాలు వచ్చాయి. ఈ సంవత్సరం తెలంగాణలో అతివృష్టి ఉండే అవకాశం ఉంది' అని పంచాంగంలో సిద్ధాంతి హెచ్చరించారు.  పంటలు సమృద్ధిగా పండుతాయని.. రైతులు తమ భూములకు అనుకూలించే పంటలు మాత్రమే వేయాలని సూచించారు. కొత్త పంటలు వేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని సిద్ధాంతి చెప్పారు.

4 /8

'పాలకుల మధ్య విభేదాలు వస్తాయి. అవి ప్రభుత్వ పాలనపైన దుష్పరిణామాలు చూపించే అవకాశం ఉంది' అని రేవంత్‌ రెడ్డి పాలనపై సిద్ధాంతి పంచాంగంలో చెప్పారు. ప్రభుత్వ పాలనలో ఇబ్బందులు ఏర్పడతాయని తెలిపారు.

5 /8

'పాలకులలో స్వార్థపూరిత ఆలోచనలు పెరుగుతాయి. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం మధ్య విభేదాలు రాష్ట్రానికి పలు ఇబ్బందులకు దారితీస్తుంది' అని రాజకీయ పరిణామాలు సిద్ధాంతి వివరించారు.

6 /8

'రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పెట్టుబడులు పెట్టకపోతే మంచిది. సంవత్సరాంతం వరకు నూతన పెట్టుబడులు నష్టం కలిగిస్తుంది' అని ప్రజలకు రాజేశ్వర సిద్ధాంతి సూచనలు చేశారు. 

7 /8

'ఈ సంవత్సరం బీఆర్‌ఎస పార్టీకి ఎన్నికల విజయాలు భారీగా ఉంటాయి' అని సిద్ధాంతి ప్రకటించారు. మరోవైపు పార్టీ నాయకులపై మీడియా వంటి వ్యవస్థల ద్వారా దుష్ప్రరానికి గురై అవకాశం ఉందని హెచ్చరించారు.

8 /8

పంచాంగ శ్రవణం పఠనం చేసిన అనంతరం కేటీఆర్‌, బీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులకు సిద్ధాంతి ఆశీర్వదించారు. అనంతరం ఉగాది పచ్చడ అందరికీ పంచారు. ఈ సందర్భంగా సిద్ధాంతిని బీఆర్‌ఎస్‌ పార్టీ ఘనంగా సత్కరించింది.