ap govt on Dasara holidays: తల్లిదండ్రులు ముఖ్యంగా స్కూళ్లకు సెలవుల్ని పొడించాలని ఏపీ ప్రభుత్వంను డిమాండ్ చేస్తున్నారు. పండగ మరుసటి రోజున తిరిగి స్కూళ్లకు వెళ్లడం విద్యార్థులు భారంగా ఫీల్ అవుతారని తల్లిదండ్రులు చెప్తున్నారు.
1/6ప్రస్తుతం దేశ వ్యాప్తంగా దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ముఖ్యంగా దసరా ను చాలా మంది ఎంతో పవిత్రంగా జరుపుకుంటారు. తొమ్మిది రోజుల పాటు అమ్మవారు తొమ్మిది అవతారాల్లో భక్తులకు దర్శనం ఇస్తారు. ఈ నేపథ్యంలో అక్టోబర్ 2న మనం దసరా విజయదశమిని జరుపుకోబోతున్నాం.
2/6అయితే.. ఏపీ ప్రభుత్వం అన్ని స్కూళ్లకు ఇప్పటికే సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 2 వరకు సెలవుల్ని ప్రకటించింది. దీంతో అందరు తమ సొంతూళ్ల బాటపట్టారు. దసరా అంటే చాలా మంది తమ బంధుమిత్రులతో, స్నేహితులతో ఎంతో పండగలా జరుపుకుంటారు
3/6రకరకాల పిండివంటలు, బతుకమ్మలు, రావణుడి దహనం, మొదలైన ఉత్సవాలు జరుపుకుంటారు. ఏపీ ప్రభుత్వం పిల్లలకు దసరా సెలవుల్ని అక్టోబర్ 2వరకు ప్రకటించింది. అంటే పండగ తెల్లారే స్కూళ్లకు వెళ్లాల్సి ఉంటుంది. దసరాకు చాలా రోజులు సెలవులు వస్తాయి.
4/6పండగ మరుసటి రోజున స్కూళ్లకు వెళ్లాలంటే పిల్లలు మారం చేస్తారు. పండగ రోజు కూడా చాలా మూడీగా ఉంటారు. అందుకే.. ఏపీ ప్రభుత్వం దసరా సెలవుల్ని మరో రెండు రోజుల పాటు పొడిగించాలని, అక్టోబర్ 4 లేదా 5 వ తేదీ వరకు పొడిగించాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. కావాలిస్తే రెండో శనివారం లేదా మరో హలీడేలో క్లాసులు నిర్వహించుకునేలా ప్లాన్ చేసుకొవాలని కూడా కోరుతున్నారు.
5/6ఈ క్రమంలో చాలా మంది తల్లిదండ్రులు తమ డిమాండ్ ను ప్రభుత్వం, విద్యాశాఖకు తెలిసేలా ప్రయత్నిస్తున్నారు. మరొవైపున విద్యార్థులు మాత్రం ఇప్పటికే దసరా సెలవులతో పండగలు చేసుకుంటున్నారు. ఇప్పుడు ఈ కొత్త డిమాండ్ కు కనుక ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇస్తే మరో రెండు రోజులు పిల్లలకు సెలవులు రానున్నాయి.
6/6దీంతో ఇది పిల్లలకు డబుల్ బొనాంజాగా చెప్పుకొవచ్చు. మరోవైపు తల్లిదండ్రులు, ప్యారెంట్స్ సైతం ఇటీవల వర్షాలు, పండగల నేపథ్యంలో హలీడేలతో.. సిలబస్ విషయంలో ఒకింత టెన్షన్ కు గురౌతున్నారు. పిల్లలపై సిలబస్ భారం పడుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు పిల్లలు మాత్రం హలీడేల్ని ఎంజాయ్ చేస్తున్నారు.